జగన్‌ను దేవుడే రక్షించాలి: గాదె, మా హక్కు: హర్ష

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సమావేశానికి వెళ్లడం తమ హక్కు అని, పార్టీ సభ్యులుగా ఉన్నంతవరకు తమను ఎవరూ అడ్డుకోలేరని పార్లమెంట్ సభ్యడు హర్షకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు ఉన్న హక్కుల మేరకే పాసులు పొందామని అన్నారు.
సమావేశంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలిపామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం గౌరవిస్తుందని భావిస్తున్నామని హర్షకుమార్ వ్యక్తం చేశారు.
ఎఐసిసి సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ పాస్‌లు లేకుండానే హాజరయ్యారు. సమైక్యాంధ్ర ప్లకార్డులతో ఎంపీలు సమావేశంలో నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ ఎంపీలు జై తెలంగాన నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications