బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!!
ప్రముఖ ప్రవచన కర్త గరకపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. తాజాగా గరికపాటి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని చదువుకునే పేద విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. గరికపాటి టీం స్పందించింది. ఆ వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చింది.
ప్రవచన కర్త గరికపాటి తాజాగా బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పైన "బళ్లలో మధ్యాహ్న భోజనమే ముఖ్యమైంది. చదువు మిధ్యాహ్న మైంది. చదువు ఎవడికి అక్కర్లే... భోజనంలో గుడ్డెట్టారా... గాడిద గుడ్డెట్టారా? అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంది? బుద్దుందా లేదా? చదివితే చదువుకోవాలి? లేకపోతే వెళ్లిపొమ్మని చెప్పు. కోడిగుడ్ల కోసం వస్తావా నీవు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టార్లు వాళ్ల ఖర్మ కాలి.

చదువు చెప్పక్కర్లా.. ఎన్ని గుడ్లు వెళ్లాయి? ఎన్ని గుడ్లు పేలాయి? ఎన్ని గుడ్లు మధ్యలో పోయాయి? ఎన్ని గుడ్లు ఈ మాస్టారు తినేశారు? ఇక వాళ్లు చదువెందుకు చెబుతారండీ? అసలు పిల్లలకు భోజనం పెట్టడమేంటి? వాళ్ల భోజనాలు వాళ్లను తెచ్చుకోమనండి.. లేకపోతే మానేయమనండి! పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫాం ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా...? శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు! విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా.. అవసరమా! చదువు రావట్లేదు ఎవరికి? భోజనాలే వస్తున్నాయి..." అంటూ గరికపాటి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాదం వేళ గరికపాటి టీం క్లారిటీ
ఈ వ్యాఖ్యల పైన అనేక మంది స్పందించారు. బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పైన ఇలాంటి వ్యాఖ్యలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి వ్యాఖ్యలను ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో గరికపాటి నరసింహారావు బృందం వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమేనని, ఆయన చేసిన పూర్తి ప్రసంగాన్ని వినకుండా నిర్ణయానికి రావడం సరి కాదని చెబుతున్నారు.
గరికపాటి ఉద్దేశం మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా పేద విద్యార్థులను కించపరచడం కాదని, ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారని స్పష్టం చేశారు. ఆయన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు వెల్లడించారు. దీంతో.. ఇప్పుడు గరికపాటి చేసిన వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా.. లేక, కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది.
-
చట్టం చేయడంతో అమరావతి అంశం ముగిసినట్టు కాదు- అసలు సమస్యలు ఇప్పుడే: సాయిరెడ్డి -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications