వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ను కల్సిన హరి, కళ్యాణ్‌రామ్: టిడిపిలోనే వర్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు, హీరో నందమూరి కళ్యాణ్ రాంలు గురువారం ఉదయం కలిశారు.

గవర్నర్‌కు హరీష్ రావు లేఖ

గవర్నర్ నరసింహంకు తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కేంద్రం ప్రకటించే ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలని కోరారు. విద్యుత్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, డిస్కం, జెన్కో విభజన పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 Harikrishna meets KCR

టిడిపిలోనే స్వతంత్ర ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. స్వత్రంత్ర అభ్యర్థిగా గెలుపొందినప్పటికీ, తాను టిడిపి ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. టిడిపి తరపున టికెట్ రాకపోవడంతో వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు.

చంద్రబాబుతో సిఎస్ మహంతి భేటీ

చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉదయం సమావేశమయ్యారు. వచ్చే నెల 2 నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.

జూన్ రెండు వరకు ప్రక్రియ పూర్తిపై చంద్రబాబుకు సీఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. ఉద్యోగ పంపిణీ, ఇతర కీలకఅంశాలతో పాటు, కొత్త రాజధాని, ఇత మౌలిక అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

English summary
Telugudesam Party leader Harikrishna and Hero Kalyan Ram met TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X