టీటీడీకి రూ. 1.20 కోట్లు విలువ చేసే హాఫ్ బ్లేడ్లు విరాళం..ఏడాదికి సరిపడేలా
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 63,738 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 19,746 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.79 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
కాగా హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించింది. దీని విలువ 1.20 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడును కలిసి ఈ బ్లేడ్లను అందజేశారు. ఈ హాఫ్ బ్లేడ్లు.. ఏడాదికి సరిపడేలా తిరుమల కల్యాణకట్ట అవసరాలను తీరుస్తాయి.
ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడారు. భక్తులు తలనీలాలు సమర్పించడానికి బ్లేడ్ల కోసం ఏడాదికి 1.16 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోన్నామని అన్నారు. రోజుకు 40,000 హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామని చెప్పారు. ఏడాదికి టీటీడీ అవసరాలకు సరిపడేలా బ్లేడ్లను విరాళం ఇవ్వడానికి దాత ముందుకు రావడం గొప్ప విషయమని అభినందించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.
-
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications