IRCTC అరుణాచల మోక్ష యాత్ర - తీర్థ క్షేత్రాలు, రూట్, షెడ్యూల్, ధరలు..!!
అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అరుణాచలం దర్శనం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్య లో భక్తులు తరలి వస్తున్నారు. వీరి కోసం రైల్వే ఈ మధ్య కాలంలో ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల నుంచి ఏర్పాటు చేస్తోంది. కాగా, ఐఆర్సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో మరిన్ని పుణ్య క్షేత్రాలను కలిపి ప్యాకేజీగా ప్రకటించింది. మొత్తం ఐదు రోజులపాటు సాగే ఈ టూర్ లో పలు ప్రాంతాలను కూడా సందర్శించి రావచ్చు. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ వెల్లడించింది.
ఐఆర్సీటీసీ "అరుణాచల మోక్ష యాత్ర" ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగనుంది. కాచిగూడ స్టేషన్ రైల్వే స్టేషన్ (హైదరాబాద్) నుంచి రైలు బయల్దేరుతుంది. ఈ రైలులు స్లీపర్, 3AC బెర్తులు ఉంటాయి. పుదుచ్చేరి : అరబిందో ఆశ్రమం, ఆరోవిల్లె, ప్యారడైజ్ బీచ్ ప్రదేశాలను ప్యాకేజీలో ప్రకటించారు. తిరువన్నామలై లో అరుణాచలేశ్వర దేవాలయం సందర్శనతో పాటుగా కాంచీపురం లో కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం దర్శనం ఉంటుంది. మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 5 (17:00) గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ (17653) బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ సాగుతుంది. రెండో రోజు ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుంటారు.

పుదుచ్చేరీలో హోటల్ లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రైషప్ అవుతారు. ఆ తర్వాత ఆరోవిల్లె, అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్ సందర్శిస్తారు. రాత్రి బస అక్కడే ఏర్పాటు చేసారు. మూడో రోజు : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి తిరువన్నమలైకి బయలుదేరుతారు. అక్కడ దిగిన తర్వాత హోటల్ కి తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచలం ఆలయ సందర్శనకు వెళ్తారు. రాత్రి బస తిరువన్నమలై లోనే ఉంటుంది. నాలుగో రోజు : ఉదయం హోటల్లోనే అల్పాహారం చేస్తారు. అనంతరం చెక్ అవుట్ చేసి 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం బయలుదేరుతారు. అక్కడ కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోని అరక్కోణం చేరుకుంటారు.
కాగా, అక్కడి రైల్వే స్టేషన్లో సాయంత్రం 6.05 గంటలకు హైదరాబాద్ కు ట్రైన్ బయలుదేరు తుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది. ఐదో రోజు : ఉదయం 07:50 గంటలకు ట్రైన్ కాచి గూడ చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది. ఇక..ప్యాకేజ్ ధరలు : కంఫర్ట్ (3AC) ట్విన్ షేరింగ్ - ఒక్కరికి రూ.19,130, ట్రిపుల్ షేరింగ్ - ఒక్కరికి రూ.14,740, 5-11 ఏళ్ల పిల్లలు - విత్ బెడ్ రూ.10,700, వితౌట్ బెడ్ రూ.8,060 గా నిర్దారించారు. స్టాండర్డ్ (SL) : ట్విన్ షేరింగ్ - ఒక్కరికి రూ.17,060, ట్రిపుల్ షేరింగ్ - ఒక్కరికి 12,670, 5-11 ఏళ్ల పిల్లలు - విత్ బెడ్ రూ.8,630, వితౌట్ బెడ్ రూ.5,980గా వెల్లడించారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications