వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ రైతులకు జగన్ భరోసా: కరోనా కష్టాల్లో కొత్త నిర్ణయం.. జగన్ లక్ష్యమేంటంటే..?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో రైతులకు వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద నగదు వారి ఖాతాలకు జమచేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఐదేళ్ల పాటు రైతు భరోసాను అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. తొలి విడతలో భాగంగా రూ.2800 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాల్లోకి జమచేయడం జరిగింది. మొత్తం 49లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.5500 నేరుగా తమ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం జగన్.

జగన్ కెరీర్లో మరో కీలక మలుపు- గెలిచినా, ఓడినా విజయమే... విపక్షాలకు సంకటం....జగన్ కెరీర్లో మరో కీలక మలుపు- గెలిచినా, ఓడినా విజయమే... విపక్షాలకు సంకటం....

 ఐదేళ్లలో రైతన్నకు రూ.67,500

ఐదేళ్లలో రైతన్నకు రూ.67,500

ఇక అర్హులైన రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో పెట్టడం జరిగిందని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా రైతుకు రూ. 13500 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఐదేళ్లలో రైతన్నకు రూ.67,500 ఇస్తామని చెప్పిన సీఎం జగన్... రైతుల కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

బ్యాంకర్ల నుంచి రైతులకు ఇబ్బంది కలిగితే 1902 అనే నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆగష్టు నెలలో రెండో విడతగా రూ.4వేలు ఇస్తామని చెప్పిన జగన్ మూడో విడతగా సంక్రాంతి సమయంలో రూ.2వేలు ఇస్తామని చెప్పారు.

 రైతులు బాగుంటేనే అందరం బాగుంటాం

రైతులు బాగుంటేనే అందరం బాగుంటాం

పార్టీలు చూడటం లేదని, కులం మతం చూడటం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని చెప్పారు. తమకు ఓటు వేయని రైతులకు కూడా రైతు భరోసాను ఇస్తున్నామని చెప్పారు. ఇందులో రాజకీయాలు ఉండవని కేవలం రైతన్నలు బాగుండాలనే ఉద్దేశంతోనే సహాయం చేస్తున్నామని చెప్పారు. రైతులు బాగుంటేనే ప్రతి ఒక్కరం బాగుంటామని అందుకే వారికి తోడుగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఇక ఈ నెల 30న 10వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పిన సీఎం జగన్..వ్యవసాయం వ్యవసాయ ఆధారిత సమస్యలపై సమాచారంను ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి పొందొచ్చంటూ వెల్లడించారు. అంతేకాదు పంటకొనుగోలుకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇక్కడ లభ్యం అవుతుందని చెప్పారు.

 రైతు భరోసా కేంద్రాలపై ...

రైతు భరోసా కేంద్రాలపై ...

రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ కియోస్క్‌లు స్మార్ట్‌టీవీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... వ్యవసాయ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. అంతేకాదు పంట లాభదాయకంగా మార్చుకునేందుకు నిపుణులు మంచి సలహాలు సూచనలు కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క సమాచారం లభిస్తుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు. భూసార పరీక్షల కోసం ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. గిట్టుబాటు ధరలు కల్పించడంలో రైతుభరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పిన సీఎం జగన్... పంట నష్టం జరిగితే వెంటనే బీమా చర్యలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై మాట్లాడిన సీఎం జగన్... ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు తమ ప్రభుత్వం 5లక్షలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Recommended Video

CM YS Jagan Key Announcement Of Janata Bazars In Every Village
 ఉచిత విద్యుత్ పై ...

ఉచిత విద్యుత్ పై ...

రైతులు పండించే పంటలను గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో వైయస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇక్కడ అన్ని కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు ఇతర వస్తువులు లభ్యమవుతాయని చెప్పారు. ఇందుకోసం ఒక ఏడాది సమయం పడుతుందని చెప్పారు. ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 82శాతం ఫీడర్లు ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం జగన్... మరో 18శాతం ఫీడర్లు వచ్చే రబీ కల్లా సిద్ధమవుతాయని సీఎం చెప్పారు. కౌలుచట్టంలో కూడా మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పారు.

English summary
CM Jagan launches YSR Raithu Bharosa scheme that transfers cash of Rs.5500 to farmers accounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X