Fact Check: కిలో అరటిపండ్లకు 50 పైసలేనంటూ జగన్ ట్వీట్.. వాస్తవాలివే!
Fact Check: కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడవుతున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వాదన పూర్తిగా సత్యదూరం అని స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా వాస్తవాలను వెల్లడించింది. "అక్టోబర్‌లో ఈ సీజన్ ప్రారంభం కాగానే టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడు పోయింది.
నవంబరు మొదటి వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు రూ.7 వేలు, బీ గ్రేడ్ రూ.4 వేలు, సీ గ్రేడ్ రూ.3వేలకు అమ్ముడు పోయాయి. రెండో వారంలో అవే ధరలు నిలకడగా కొనసాగాయి. మూడో వారంలో ఏ గ్రేడు రూ.8 వేలు, బీ గ్రేడు రూ.4 వేలు, సీ గ్రేడు రూ.3 వేలకు అమ్ముడు పోయాయి. నాలుగో వారంలో ఏ గ్రేడు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. బీ గ్రేడు రూ.6 వేల నుంచి రూ 8 వేలకు, సీ గ్రేడు రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడు పోయాయి." అని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.

అనంతపూర్, సత్యసాయి జిల్లా, కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంట వేయగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక వర్షాలు కురియడంతో చాలా వరకు అరటి పంట దెబ్బతింది. అయితే పంటల పరిస్థితిని ముందుగానే అంచనా వేసినందున ట్రేడర్లు, ఎగుమతిదారులతో అరటి పంట పండే అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో కూడా ఇలాంటి సమావేశాలే ఏర్పాటు చేశారు.
హర్యానాలోని శీతల గిడ్డంగుల వారితో కూడా మాట్లాడారు. ఫలితంగా ఉత్తర భారత దేశంలోని కొనుగోలు దారులు ఆంధ్రప్రదేశ్ లో పండిన అరటి కొనుగోలు ప్రారంభించారు. కడప, అనంతపూర్ జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారతదేశంలోకి పంపి అక్కడ అమ్మడం జరిగింది. గత వారం రోజులుగా మెట్రిక్ టన్నుకు రూ 2 వేల నుంచి రూ.4 వేలు పెరిగింది. అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వేను కోరడం జరిగింది. డిసెంబర్ 2వ వారం నుంచి అరటి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వాస్తవాలు ఇలా ఉండగా రైతులలో నిరాశ నింపే విధంగా ప్రకటనలు చేయడం సబబు కాదు. రైతు సోదరులు కూడా వాస్తవాలు గ్రహించి ఇలాంటి ప్రచారాలకు ప్రభావితులు కావద్దు." ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం కోరింది.
కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడు అవుతున్నాయి అంటూ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో చెప్పడం పూర్తిగా సత్యదూరం. అక్టోబర్ లో ఈ సీజన్ ప్రారంభం కాగానే టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడు పోయింది. నవంబరు మొదటి వారంలో ఏ గ్రేడు అరటి… pic.twitter.com/vWM41RdDYi
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) December 2, 2025
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
‘ఇళ్లు లేని పేదవాడు’ ఉండకూడదు. 2029 నాటికి 17 లక్షల గృహాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications