'మాల్యాను, లాలూను మించిన కేసులు.. 2019లోగా జగన్ అరెస్ట్ ఖాయం'

Subscribe to Oneindia Telugu

విజయవాడ: నిన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి, నేడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. 2019ఎన్నికల్లోగా జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. విజయ్ మాల్యా, లాలూ ప్రసాద్ యాదవ్ కు మించిన కేసులు జగన్ పై ఉన్నాయని, కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు.

ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేయడమే పనిగా పెట్టుకున్న జగన్... ఇప్పుడు ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించాలని అనుకుంటున్నారని విమర్శించారు. జగన్ రాష్ట్రంలో ఓ అరాచకవాదిలా తయారై గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం లేదన్నారు.

jagan may arrest before 2019elections says KE Krishnumurthy

బుధవారం కేఈ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh Deputy CM KE Krishnamurthy predicted that YSRCP President Jagan may arrest before 2019 elections

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X