పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యల వివాదం.. జనసేన కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలలో దుమారం మొదలైంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన జనసేన
తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడటం పవన్ కళ్యాణ్ కు సరికాదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంటుందని వారు అన్నారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ తాజాగా జనసేన పార్టీ దీనిపైన స్పందించింది.

జనసేన పార్టీ ప్రకటన విడుదల
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరించవద్దని జనసేన పార్టీ కీలక అప్పీలు చేసింది.
కోనసీమలో పర్యటించిన సమయంలో పవన్ వ్యాఖ్యలు
రాజోలు నియోజకవర్గం లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని పేర్కొన్న జనసేన పార్టీ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమలో పర్యటించిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎంతో పచ్చగా ఉండేవని ఆయన అన్నారు.
కొబ్బరి చెట్లకు దిష్టి
ఇప్పుడు తలలు తీసేసినట్టు కొబ్బరి చెట్లు ఉన్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమే కారణమని పేర్కొన్నారు తెలంగాణ నేతలు గోదావరి జిల్లాలలో పచ్చదనం బాగుంటుందని అనేవారిని అందుకే దిష్టి తగిలినట్టు ఉందని వెటకారంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యల పైన దుమారం రాజుకుంది.
పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులే కాదు బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమని, పవన్ ఆస్తుల పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications