వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి వైపు కెఏ పాల్ చూపు, పార్టీ అగ్రనేతలతో భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 KA Paul seeing at BJP
న్యూఢిల్లీ: ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకులు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారుయ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశంసించారు. కెఏ పాల్ సోమవారం బిజెపి అగ్రనేతలను కలిశారు.

బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ తదితరులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను అద్వానీ, రాజ్ నాథ్, మోడీ తదితరులను కలిశానని చెప్పారు. తనను వారు బిజెపిలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

తాను తన కార్యకర్తలు, తన వారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని కెఏ పాల్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలనుకుంటున్నట్లు కెఏ పాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

కాగా, కెఏ పాల్ ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకులు. ఆయనకు వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబంతో వైరం ఉంది. ఆయన జగన్ పైన పలు సందర్భాల్లో మాటల దాడి చేశారు. సోదరుడి హత్య కేసులో ఆయనను గతంలో పోలీసులు అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు నరేంద్ర మోడీ, బిజెపిల వైపు చూస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు ప్రకటించారు. నాగార్జున సోమవారం సాయంత్రం మోడీతో భేటీ కానున్నారు. కెఏ పాల్ ఇప్పుడు బిజెపిలో చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.

English summary

 KA Paul on Monday met Bharatiya Janata Party senior leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X