Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా: కడప జిల్లా తడిచి ముద్ద: సీమ జిల్లాల్లో వర్షాతిరేకం

కడప: అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీపై విస్తారంగా పడింది. రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి ఆరంభమైన వర్షం ఎడతెరిపినివ్వట్లేదు. ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. అనేక మండలాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు అంచనాలు వెలువడుతోన్నాయి. అటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఆదివారం రోజంతా ఉక్కపోతతో ఇబ్బందులు పడిన సీమ ప్రజలకు.. అర్ధరాత్రి నుంచి భారీ వర్షం ముంచెత్తింది. అప్పటిదాకా మేఘావృతమై కనిపించిన ఆకాశం.. ఒక్కసారిగా కుండపోతగా వర్షించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అత్యధికంగా చింతకొమ్మదిన్నె, కడపల్లో వర్షం కురిసినట్లు తెలుస్తోంది. చింతకొమ్మదిన్నెలో 145, కడపలో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Kadapa District witnessed Massive rains, Many areas crossed 100mm mark. Still raining

మైదుకూరు-117.5, లింగాల-92.5, యర్రగుంట్ల-81, జమ్మలమడుగు-79, రాజంపేట-77.5, పెండ్లిమర్రి-76, చాపాడు-70, సిద్ధవటం-69, పులివెందుల-68.5, వల్లూరు-67.5, రామాపురం-67లల్లో మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి ఇంకో రెండు నుంచి మూడు గంటల పాటు ఉండొచ్చన అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అనంతపురం జిల్లాలో ధర్మవరం, మడకశిర, ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం, పెనుకొండ, హిందూపురం, అమరాపురం, కుందుర్పి వంటి చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల హంద్రీ-నీవా జలకళను సంతరించుకుంటోంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి.

అటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ శని, ఆదివారాల్లో భారీ వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలోని వేపాడ, కరకవలస, జామి, డెంకాడ, విశాఖపట్నం జిల్లా ఆనందపురం, కోటపాడు, గంభీరం, అనంతగిరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లా మందస, సంతబొమ్మాళి, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వంటి చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు ఉండొచ్చని అంచనా వేస్తోన్నారు.

More From
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+