ఇక గ్రేటర్ విజయవాడ..: అమరావతితో సంబంధం లేకుండా..!!
రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. రెండో విడత భూసమీకరణకు పూనుకుంది. ఇదివరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన ప్రతిపాదనలకు అనుగుణంగా మలిదశ సమీకరణ దిశగా ముందడుగు వేసింది.
రెండో విడత భూసమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇదివరకే విడుదలైంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో తాజా భూసమీకరణ చోటు చేసుకుంది. ఈ విడతలో మొత్తం 16,666.56 ఎకరాలను సమీకరించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాలగు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాల మధ్య విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు కేశినేని చిన్ని ఓ తాజా అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అత్యవసరమని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు అందజేశారు. అమరావతి సచివాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
విజయవాడ సుస్థిర, ప్రణాళికబద్దమైన అభివృద్ది కోసం గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అవరమని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర చుట్టుపక్కల ఉన్న 74 గ్రామాలను కలిపి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు.
సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయటానికి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్- కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులకు సైతం ఓ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. విజయవాడ నగర అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని తాము చేసిన ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications