కొత్త జిల్లాలు 29 కాదు 28, జిల్లా కేంద్రాలు.. మండలాల్లో మళ్లీ మార్పులు- ఇదే ఫైనల్..!!
ఏపీ ప్రభుత్వం జిల్లాలు..మండలాలు పునర్విభజన పై తుది నిర్ణయం తీసుకుంది. తొలుత 29 జిల్లాలుగా ప్రతిపాదించినా.. ఇప్పుడు ఆ సంఖ్య 28కి పరిమితం చేసింది. కాగా, మదనపల్లి జిల్లా స్థానంలో అన్నమయ్య ను జిల్లాగా ఖరారు చేసినట్లు సమాచారం. భౌగోళికంగా మాత్రం కొత్త మార్పులు రానున్నాయి. అదే విధంగా మండలాల పైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో కొత్త జిల్లాలకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.
ఏపీ మంత్రివర్గం ఈ రోజు భేటీ కానుంది. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా కొత్త జిల్లాల పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న జిల్లా భౌగోళిక స్వరూపం దాదాపుగా మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. ఇదివరకే ప్రకటించిన మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాను అన్నమయ్య జిల్లాగా వ్యవహరిస్తారు. రాయచోటి కూడా ఇదే జిల్లాలో ఉంటుంది. దీంతో రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న కొందరి డిమాండ్లకు, రాయచోటినే కొనసాగించాలన్న ఆందోళనలకు తావివ్వకుండా మదనపల్లె హెడ్‌క్వార్టర్స్‌గా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తారు. కొత్తగా ప్రకటించినట్టు మదనపల్లె జిల్లా పేరు మాత్రం ఉండదని సమాచారం.

ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగిలిన రాయచోటి అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. రెవెన్యూ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం సోమవారం ఫైలు పంపించనుంది. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటుపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఈ విషయంలో దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మంత్రివర్గ భేటీలో ఏదైనా అనూహ్య చర్చ జరిగి ముఖ్యమంత్రి మార్పులు సూచిస్తే ఆ దిశగా సవరణలు ఉంటాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గూడూరు డి విజన్ తిరుపతి జిల్లాలో ఉంది. ఈ డివిజన్లోని వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు.
గూడూరు డివిజన్లోని గూడూరు, కోట, చిల్లకూరు మండలాల ను తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుపతి జిల్లాలో ఉన్న కలు వాయు, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి నెల్లూరులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 29కు చేరింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో మదనపల్లె పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం లేదు. అన్నమయ్య పేరిట ఉన్న జిల్లాకే మదనపల్లె హెడ్‌క్వార్టర్స్‌గా ఉండనుంది. ప్రతిపాదిత మదనపల్లె జిల్లా ప్రాంతం ఇందులోనే ఉండనుంది. దీంతో జిల్లాల సంఖ్య 28కు పరిమితమైంది. పోలవరం జిల్లా కూర్పులో ఎలాంటి మార్పులేదు. కొత్తగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో పొదిలి ఉంది. దాన్ని అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. కురిచేడు, దొనకొండ మండలాలను ప్రకాశంలోనే కొనసాగించనున్నారు.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications