తాటతీస్తాం... మీసం మెలేసి బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి జయరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల సమరం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ప్రతిపక్ష టిడిపిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుంటే, రెండు రోజుల పాటు సాగిన మహానాడులో వైసీపీపై నిప్పులు చెరిగారు టిడిపి నేతలు.
తాజాగా స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ సర్కార్ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.వైసిపి ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం అంటూ బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేశారు. ఒక ఛాన్స్ అంటే ఒక తప్పిదం చేశారని, ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని, ప్రజలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని బాలకృష్ణ ప్రజలకు సూచించారు.
ఓటు అంటే నోటు కాదు అని తెలుసుకోవాలని బాలయ్య ప్రజలకు హితవు పలికారు. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాలయ్య సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుందని మరుగుదొడ్ల పైన కూడా పన్నులు వేసే పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ మండిపడ్డారు.

ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గుమ్మనూరు జయరాం రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలయ్య ఆరోపణలు చేస్తున్నారని ఆయనను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టంచేశారు. మీసం మెలేసి చెప్తున్నా, బాలకృష్ణ తాటతీస్తామంటూ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పని పడతారని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయం అంటూ గుమ్మనూరు జయరాం జోస్యం చెప్పారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు జనం రావడం లేదని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహిళలతో తిట్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ గెలిస్తే బీసీలు గెలిచినట్టు అంటూ పేర్కొన్న మంత్రి గుమ్మనూరు జయరాం బాలకృష్ణను ఓడించడం ఖాయమంటూ తేల్చి చెప్పారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications