Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్విస్ట్: 'హోదాపై మోడీ హామీ ఇవ్వనేలేదు, ఢిల్లీలో మార్ఫింగ్ వీడియోలతో బాబు ప్రజంటేషన్'

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. తిరుపతి సభలో మోడీ హోదాపై ప్రకటన చేశారనే అంశం విషయంలోనే ఇన్నాళ్లూ బీజేపీ ఇరుకునపడింది.

కానీ ఈ ప్రచారం మరీ ఎక్కువయి మొదటికే మోసానికి వస్తోందని భావించిన బీజేపీ నేతలు టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. 2014లో తిరుపతి సహా పలు సభల్లో మోడీ పాల్గొన్న ప్రచారాలకు సంబంధించిన వీడియోలను పూర్తిగా పరిశీలించి ఇప్పుడు ఎదురుదాడికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. అసలు తిరుపతి సభలో మోడీ హోదాపై హామీ ఇవ్వలేదని చెబుతున్నారు.

Recommended Video

    టీడీపీ అంటే తెలుగు 'డ్రామా' పార్టీ, అవినీతిని తవ్వడానికి బుల్డోజర్ కావాలి

    తిరుపతి సభపై చంద్రబాబు అసత్య ప్రచారం

    తిరుపతి సభపై చంద్రబాబు అసత్య ప్రచారం

    ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధాని మోడీ చెప్పలేదని ఇప్పటికే బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు చెప్పారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై బీజేపీ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా హోదా గురించి మాట్లాడకుండా, ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు మళ్లీ హోదా అంటున్నారని, అందుకు తిరుపతి సభలో మోడీ హామీ ఇచ్చారనే అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

    చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత, అవినీతి అంటూ

    చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత, అవినీతి అంటూ

    ఏపీకి హోదా ఇస్తామని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారనే ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా స్పందించారు. హోదా ఇస్తామని ప్రధాని మోడీ తిరుపతిలోనే కాదు.. నెల్లూరు సభలోనూ ఎప్పుడూ చెప్పలేదని, టీడీపీ నేతలు ప్రధాని మాటలను మార్చి, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 'రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, అవినీతిపై నిజానిజాలు' అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ హోదా వద్దని తేల్చిచెప్పడంతో హోదాకు సమానమైన నిధులు ఇచ్చామన్నారు.

    మోడీ మార్ఫింగ్ వీడియోలతో ఢిల్లీలో బాబు పవర్‌పాయింట్

    మోడీ మార్ఫింగ్ వీడియోలతో ఢిల్లీలో బాబు పవర్‌పాయింట్

    ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి మోడీ మార్ఫింగ్‌ వీడియోలను చూపించి చంద్రబాబు జాతీయ మీడియాను పక్కదోవ పట్టించారని సోము వీర్రాజు సంచలన ఆరోపించారు. తాము ఏ విషయంలో నమ్మక ద్రోహం చేశామో చెప్పాలంటూ 10 ప్రశ్నలను సంధించారు. అమరావతికి ఎలాంటి డీపీఆర్‌లు లేకున్నా రూ.1500 కోట్లు ఇచ్చామని, ఇచ్చిన డబ్బులను సరిగా ఉపయోగించుకోలేక తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ డ్రామలు ఆడుతోందన్నారు.

    వైసీపీ వాళ్లను తిట్టి బాబు రాజకీయం

    వైసీపీ వాళ్లను తిట్టి బాబు రాజకీయం


    చంద్రబాబు విజయవాడలో ఇటీవల నిర్వహించింది ధర్మ పోరాట దీక్ష కాదని, అధర్మ పోరాట దీక్ష అని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. నిధులు లేవంటూ దీక్ష కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఆ నిధులను ఏదైనా జిల్లాకు కేటాయిస్తే వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఉపయోగపడేవన్నారు. వైసీపీ వాళ్లు హోదా అంటుంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడిన చంద్రబాబు.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అదే నినాదాన్ని భుజానికెత్తుకోవడం విడ్డూరమన్నారు.

    రాఘవేంద్ర రావును ఎందుకు నియమించారో చెప్పండి

    రాఘవేంద్ర రావును ఎందుకు నియమించారో చెప్పండి

    ప్రత్యేక హోదాపై టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ, వాటిని నిలదీస్తే.. తెలుగువారిపై దాడిగా చంద్రబాబు చెప్పడం విడ్డూరమని బీజేపీ నేత సుధీష్ రాంభోట్ల అన్నారు. టిటిడిలో రూ.వెయ్యి కోట్లు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు డిపాజిట్‌ చేశారని ప్రశ్నించారు. రాఘవేంద్రరావును ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించడానికి కారణాలు ఏమిటో చెప్పాలన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+