దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి, లోకేష్ గ్రీన్ సిగ్నల్

By Narsimha
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి, లోకేష్ గ్రీన్ సిగ్నల్Nallari to join in Tdp|Oneindia Telugu

   చిత్తూరు:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని టిడిపి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాలోని టిడిపి ముఖ్యనేతల ద్వారా మంత్రి నారాలోకేష్‌తో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి సంప్రదించినట్టు సమాచారం. ఈ నెల 18వ, తేదిన కలికిరి నియోజకవర్గంలోని తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకోనున్నారు.

   కాంగ్రెస్‌లోకి తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎఐసిసిలో కీలకపదవి?

   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ ‌రెడ్డి కుటుంబం తొలి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. చిత్తూరు జిల్లా నుండి ప్రాతినిథ్యం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.

   టిడిపిలోకి నల్లారి,వ్యతిరేకిస్తున్న అన్నయ్య

   2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల సమయంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి జై సమైఖ్యాంద్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ తరపున కలికిరి నియోజకవర్గం నుండి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

   అప్పటి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కూడ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరుతారని తొలుత ప్రచారం సాగింది. మరోవైపు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం కూడ ఇటీవల కాలంలో మొదలైంది. కానీ, ఈ విషయమై కిరణ్‌కుమార్‌రెడ్డి నుండి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరనున్నట్టు కొంతకాలంగా ప్రచారం సాగుతుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

   నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దం

   నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దం

   చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పేరొందిన కుటుంబాల్లో నల్లారి కుటుంబం ఒకటి. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ జిల్లా, రాష్ట్రస్థాయిలో రాజకీయ చక్రాన్ని తిప్పిన నేపథ్యం ఈ కుటుంబానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతల ద్వారా కిశోర్‌కుమార్‌రెడ్డి, మంత్రి నారా లోకేశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

   మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి బాధ్యతల అప్పగింత

   మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి బాధ్యతల అప్పగింత

   చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని టిడిపిలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడ సానుకూలంగా ఉన్నారని సమాచారం. జిల్లాలో నల్లారి వారు బలమైన సామాజిక వర్గం కలిగిఉన్నందున టీడీపీని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా కిశోర్‌ కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు లోకేశ్‌ అంగీకరించినట్టు సమాచారం. ఇందులో భాగంగా జిల్లా మంత్రి అమరనాథరెడ్డికి ఈ బాధ్యత అప్పగించినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

   నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డితో చర్చించిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

   నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డితో చర్చించిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

   చిత్తూరు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అమర్నాథరెడ్డి సహా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా రామచంద్రా రెడ్డి, కేవీపల్లె మాజీ ఎంపీపీ నాగేశ్వరరెడ్డి కిశోర్‌ కుమార్‌రెడ్డితో పలు పర్యాయాలు చర్చించారని టిడిపి వర్గాలంటున్నాయి. ఈ క్రమంలో కిశోర్‌ కుమార్‌రెడ్డి తన కుటుంబసభ్యులు, ముఖ్య అనుచ రులతో సమాలోచనలు చేసి టీడీపీలో చేరేందుకు సమాయత్తం అయ్యారు. నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ఉన్న అనుచరులు, అభిమానులతోనూ చర్చించి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని వెల్లడిం చాలని నిర్ణయించుకున్నారు

   అనుచరులతో కిషోర్‌కుమార్ రెడ్డి సమావేశాలు

   అనుచరులతో కిషోర్‌కుమార్ రెడ్డి సమావేశాలు

   టిడిపిలో చేరే విషయమై నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తన అనుచరులతో చర్చిస్తున్నారని సమాచారం.ఆది వారం వాల్మీకిపురంలో అనుచరులు, అభిమానులతో సమాలో చనలు జరిపారు.త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటానని కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 18 నుంచి పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పర్యటించనున్నారు. తొలుత గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల్లోనూ, తరువాత కలకడ, కేవీపల్లె, కలికిరి మండలాల్లో పర్యటించనున్నారు.చివరగా పీలేరు మండలంలో పర్యటించి అందరి అభిప్రాయాలను తెలుసుకుని రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని లాంఛనంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

   English summary
   Former United Ap Chiefminister Nallari Kiran kumar Reddy brother Nallari Kishore kumar Reddy preparing to join in Tdp.Kishore kumar reddy meeting with his followers . Ap minister Amarnath reddy already discussed with Nallari Kishore kumar reddy.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more