భర్త వద్దన్నాడని!: మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..
ద్వారపూడికి చెందిన దేవి(19)కి చేబ్రోలుకు చెందిన కారు డ్రైవర్ రామిశెట్టి ధనసాగర్‌కు గత అగస్టు నెలలో వివాహమైంది. పెళ్లయ్యాక చేబ్రోలులోని ధనసాగర్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.
ఉంగుటూరు: మేనమామ ఇంటికెళ్తానని భార్య కోరగా భర్త తిరస్కరించాడు. మనస్తాపం చెందిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం చేబ్రోలు రైల్వే గేటు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ద్వారపూడికి చెందిన దేవి(19)కి చేబ్రోలుకు చెందిన కారు డ్రైవర్ రామిశెట్టి ధనసాగర్‌కు గత అగస్టు నెలలో వివాహమైంది. పెళ్లయ్యాక చేబ్రోలులోని ధనసాగర్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.

ఇదే క్రమంలో సోమవారం రాత్రి తన మేనమామ ఇంటికి వెళ్లొస్తానని దేవి ధన సాగర్‌ను అడిగింది. ఇందుకు ధనసాగర్ నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన దేవి మంగళవారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పెళ్లయి మూడు నెలలు కూడా తిరగకుండానే తమ కుమార్తె మరణించడం పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications