విజయవాడ వాసులకు కేంద్రం ఊహించని వరం..!!
విజయవాడ వాసులకు బిగ్ అప్డేట్. విజయవాడ కేంద్రంగా కీలక నిర్ణయం పైన కసరత్తు జరుగు తోంది. సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనల స్థాయిలో ఉన్న నిర్ణయానికి తుది ఆమోదానికి రంగం సిద్దమైంది. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగరం మధ్యలో దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు డీపీఆర్ సిద్దం చేసారు. దీని ద్వారా బెజవాడ వాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత విముక్తి లభించనుంది.
NHAI హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగరం మధ్యలో దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్దం చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు, అటు మచిలీపట్నం నుంచి విజయవాడ శివారు వరకు రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు. కాగా, నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగర పరిధిలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి దావులూరు వరకు మాత్రం కేవలం నాలుగు వరుసల రోడ్డు మాత్రమే ఉంది. ఒకవేళ నగరం మధ్యలో రోడ్డును ఆరు వరుసలుగా మార్చకపోతే, నగరానికి ఇరువైపులా స్పీడుగా వచ్చే వాహనాలు నగరం లోపలికి రాగానే ట్రాఫిక్ జామ్ సమస్య వస్తుందని గుర్తించారు. దీంతో, ఇళ్ల సేకరణ అవసరం లేకుండా, గాల్లోనే వంతెన నిర్మించడమే ఏకైక మార్గమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ నుండి ప్రారంభించి.. బందరు వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్‌ను ప్లాన్ చేస్తున్నారు.

NHAI తాజా ప్రతిపాదనలు.. కష్టాలకు చెక్
తాజా ప్రతిపాదనల మేరకు మొత్తం 14 కి.మీ. పొడవునా వంతెనను ఎలా నిర్మించాలనే దానిపై ప్రస్తుతం రెండు ప్రణాళికలు చర్చిస్తున్నారు. 14 కి.మీ. పొడవునా ఒకే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అయితే బెంజ్ సర్కిల్ వద్ద ఇప్పటికే రెండు ఫ్లైఓవర్లు ఉండటంతో వాటిపై నుంచి మూడో అంతస్తు తరహాలో దీనిని డిజైన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనకదుర్గ వారధి నుంచి బెంజ్ సర్కిల్ వరకు, బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు రెండు భాగాలుగా నిర్మించాల్సి ఉంటుంది. అయితే, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావడం వల్ల కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే భూమి సేకరించాల్సి ఉంటుంది. హైవే వాహనాలు నేరుగా ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లిపోతాయి. లోకల్ ట్రాఫిక్ కింద రోడ్డుపై ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ విస్తరణ డీపీఆర్‌లోనే ఈ ఫ్లైఓవర్‌ను చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా విజయవాడ కు కొత్త రూపు సంతరించు కోనుంది. ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా నగరంలోని వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు, పోరంకి వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications