వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్‌ సాయిరెడ్డి : టార్గెట్ టిడిపి, ట‌చ్‌లో ఇద్ద‌రు టిడిపి ఎమ్మెల్యేలు..!!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయంగా వ్యూహ‌- ప్ర‌తివ్యూహాలు అమ‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్ష వైసిపి నుండి ఫిరాయింపుల‌ను టిడిపి ప్రోత్స‌హించింది. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు టిడిపి ఎమ్మెల్యేలే ల‌క్ష్యంగా వైసిపి పావులు క‌దుపుతోంది. కార‌ణాలు ఏవైనా ఇప్ప‌టికే ఇద్ద‌రు టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు. ఇక‌, వైసిపి ఎంపి విజ‌య సాయిరెడ్డి చేప‌ట్టిన ఆప‌రేష‌న్ తో ఇద్ద‌రు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి లోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు అధికార పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది..

మ‌మ‌త బాట‌లోనే మాయావ‌తి: చ‌ంద్ర‌బాబు చ‌క్రానికి బ్రేకులు..! వాట్ నెక్స్ట్‌..!మ‌మ‌త బాట‌లోనే మాయావ‌తి: చ‌ంద్ర‌బాబు చ‌క్రానికి బ్రేకులు..! వాట్ నెక్స్ట్‌..!

ఆప‌రేషన్ సాయిరెడ్డి : ఉచ్చులో ప‌డ్డారా..

ఆప‌రేషన్ సాయిరెడ్డి : ఉచ్చులో ప‌డ్డారా..

వైసిపి ఎంపి విజ‌య‌సాయిరెడ్డి టిడిపిలో ప్ర‌జాద‌ర‌ణ ఉండి నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్న నేత‌ల‌ను వైసిపి లోకి తీసుకొచ్చేందు కు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. గ‌తంలో విశాఖ‌లో ఓ మంత్రి వైసిపి లో చేరుతున్నారంటూ లీక్ ఇచ్చారు. ఆ త‌రువాత టిడిపి అధినాయ‌క‌త్వం అల‌ర్ట్ అవ్వ‌టం తో ఆ నేత ఎంట్రీ ఆగిపోయింది. అయితే, ఇప్పుడు టిడిపి బ‌లంగా ఉన్న ప్రాంత తాల్లోని నేత‌ల‌ను టార్గెట్ చేసారు. వారికి త‌మ పార్టీ నుండి ఖ‌చ్చితంగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని.. వైసిపి అధికారంలోకి రావ టం ఖాయ‌మ‌ని వారికి వివ‌రిస్తున్నారు. దీనికి సంబంధించి స్వ‌తంత్ర స‌ర్వే సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేల‌ను వారికి చూపించి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పార్టీ అధినేత దృష్టికి ఎవ‌రెవ‌రు ఆస‌క్తిగా ఉన్నారో వివ‌రించి..జ‌గ‌న్ మాట గా వారికి హామీ ఇస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి లోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో..అధికార టిడిపిలో త‌మ సీటుకు ఎంత వ‌ర‌కు గ్యారంటీ అనే అంశాన్ని..విజ‌యావ‌కాశాల‌ను ప‌రిశీలించుకున్న త‌రువాత టిడిపి ఎమ్మెల్యేలు సాయి రెడ్డికి ఓకే చెబుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం : ఆ స్థానాల్లో ముందుగానే అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌: పొత్తు పైనా క్లారిటీ..చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం : ఆ స్థానాల్లో ముందుగానే అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌: పొత్తు పైనా క్లారిటీ..

ప్ర‌కాశం లో మాజీ మంత్రి..ఇద్ద‌రు ఎమ్మెల్యేలు

ప్ర‌కాశం లో మాజీ మంత్రి..ఇద్ద‌రు ఎమ్మెల్యేలు

వైసిపి ఎంపి విజ‌యసాయిరెడ్డి చేప‌ట్టిన ఆపరేష‌న్ లో భాగంగా..ప్ర‌కాశం జిల్లాలో మాజీ మంత్రి పై గురి పెట్టారు. ఆయ‌న తో ఇప్ప‌టికే ప్రాధ‌మిక చ‌ర్చ‌లు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ సారి ఎన్నిక‌ల్లో ఆయ‌న సొంత నియోక‌వ‌ర్గం నుండి ఎలాగో టిడిపి టిక్కెట్ వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో..త‌న కుమారుడికి సీటు ఖ‌రారు చేస్తే పార్టీ మారేందుకు అభ్యంత‌రం లేద‌ని ఆ నేత చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే, వైసిపి నుండి ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గం లో స‌మ‌న్వ‌య క‌ర్త‌ను నియ‌మించారు. టిడిపి నేత వైసిపి లోకి ఎంట్రీ ఇస్తే..స‌మ‌న్వ‌య‌క‌ర్త‌కు ఏ ర‌క‌మైన హామీ ఇస్తారో చూడాలి. అదే విధంగా..అదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే రాక ఖ‌రారైంది. ఇక‌, ప్ర‌స్తుతం ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసిపి లోకి తెచ్చేందుకు విజ‌య సాయిరెడ్డి జిల్లాకు చెందిన వైసిపి నేత‌ల ద్వారా విశ్వ ప్ర‌యత్నాలు చేస్తున్నారు. భ‌విష్య‌త్ లో ఖ‌చ్చితంగా పార్టీ అధికారంలోకి వ‌స్తుంని..పార్టీ మారితే ఎన్నిక‌ల్లో సీట్లు కూడా గ్యారంటీగా ఇస్తామ‌ని..అన్నీ తామే చూసుకుంటామ‌ని వైసిపి నేత‌లు హామీ ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..పార్టీని న‌మ్ముకున్న ఆ నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల కు న‌చ్చ చెప్పిన త‌రువాత‌నే వారిని పార్టీలోకి తీసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించ‌టంతో..ఇప్పుడు అది స‌వాల్‌గా మారింది..

టిడిపితో పొత్తు : డైల‌మా లో రాహుల్ : 25న కీల‌క స‌మావేశం..టిడిపితో పొత్తు : డైల‌మా లో రాహుల్ : 25న కీల‌క స‌మావేశం..

జ‌వ‌న‌రి లో వైసిపి లోకి ఎంట్రీ : టిడిపి అల‌ర్ట్‌

జ‌వ‌న‌రి లో వైసిపి లోకి ఎంట్రీ : టిడిపి అల‌ర్ట్‌

ఇదే జిల్లాకు చెందిన ఇద్ద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసిపి లో చేరిక దాదాపు ఖ‌రారైన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌వ‌న‌రి లో ముహూర్తం చూసుకొని వారు వైసిపి లో చేరుతార‌ని అదే జిల్లాకు చెందిన నేత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తు న్నారు. ఇదే స‌మ‌యంలో..టిడిపి సైతం అప్ర‌మ‌త్తం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రావెల కిషోర్ బాబు, ఈర‌న్న ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసారు. ఇక‌, చాలా మంది సిట్టింగ్‌ల‌కు సీట్లు రావ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో..ఎమ్మెల్యేలు కొంద‌రు అటు వైసిపి తో..ఇటు జ‌న‌సేన తో ట‌చ్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. టిడిపి సైతం పార్టీని వీడి వెళ్లే ఆలోచ‌న చేస్తున్న వారెవ‌రు..వారి వ‌ల‌న పార్టీకి ఏమైనా న‌ష్టం జ‌రుగుతుందా అనే ఆలోచ‌న‌లో విశ్లేష‌ణ‌లు చేసి స్పందిస్తున్నారు. అయితే, అనేక చోట్ల కొత్తవారికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న స‌మ‌యంలో..కొంద‌రు పార్టీని వీడినా ఇబ్బంది లేద‌నే అభిప్రాయం టిడిపి నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు ముందే ఏపిలో పార్టీల జంపింగ్‌లు భారీ స్థాయిలో ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
YCP MP Vijaya Sai reddy seriously concentrated on TDP mlas to pull them into YCP. Sources said Two Tdp mlas already given green signal to join in YCP. Joinings may be in January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X