వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకొని : దేశ‌భ‌క్తి పై ప‌వ‌న్ క‌ళ్యాన్ వివ‌ర‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇంకా వేడి పుట్టిస్తూనే ఉన్నాయి. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకు న్న విధంగా..ప‌వ‌న్ స్పందిస్తున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పాకిస్థాన్ లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగాయి. దీంతో ప‌వ‌న్ త‌న వ్యాఖ్య‌ల పై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

నా దేశ‌భ‌క్తిని శంకిస్తారా..

నా దేశ‌భ‌క్తిని శంకిస్తారా..

త‌న వ్యాఖ్య‌ల పై మొద‌లైన దుమారానికి ప‌వ‌న్ క‌ళ్యాన్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితి సున్నితంగా ఉన్న స‌మ‌యంలో చేసిన వ్యాఖ్య‌లు ఏపిలోనూ కాదు..పాకిస్థాన్ మీడియాలో నూ హ‌ల్‌చ‌ల్ చేసా యి. దీంతో..బిజెపి నేత‌లు ప‌వ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర విమ‌ర్శ‌లు చేస‌రాఉ. ఇప్పుడు ప‌వ‌న్ త‌న మాట‌ల‌కు వివ ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక మాట మాట్లాడితే పాకిస్థాన్‌ మీడియాలో వస్తుందని కలగన్నానా.. అది పట్టు కుని మీరు నా దేశభక్తిని శంకిస్తారా అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు భారత్‌-పాక్‌ యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యల పై ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది.

రుజువు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు..

రుజువు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు..

త‌న దేశ‌భ‌క్తిని ఎవ‌రి ముందు రుజువు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ సభల్లో ఏనాడైనా జాతీయ జెండాలు కన్పించాయా.. ఆ పార్టీల నాయకులు ఏనాడైనా జాతీయ జెండా పట్టుకున్నారా.. వాళ్లా దేశభక్తి గురించి మాట్లాడేది మా సభల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయన్న విషయం గుర్తించుకోండని పేర్కొన్నారు. ఏ రోజూ నా దేశభక్తిని మీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసారు. నా మాట ల్ని వక్రీకరించి పదే పదే చూపిస్తుంటారు. భగత్‌సింగ్‌ గురించి మాట్లాడినప్పుడు నేను అన్నది ఏంటి? మీరు చూపిం చింది ఏంటి అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై పరోక్ష విమర్శలు చేశారు.

ప‌వ‌న్ ఆ వ్యాఖ్య‌ల‌తో డామేజ్ అయ్యారా

ప‌వ‌న్ ఆ వ్యాఖ్య‌ల‌తో డామేజ్ అయ్యారా

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న ఇమేజ్ కొంత మేర డామేజ్ అయింద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. త‌న వ్యాఖ్య‌ల కు ఖండ‌న ఇచ్చినా..వివ‌ర‌ణ ఇచ్చినా..ఆ వ్యాఖ్య‌ల ప్ర‌భావం మాత్రం ప‌వ‌న్ పై ఇంకా ఉన్న‌ట్లుగానే ఉంద‌నే అభిప్రా యాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌వ‌న్ ఇప్పుడు ఆ వ్యాఖ్య‌ల‌కు ఎంత వివ‌ర‌ణ ఇచ్చినా..అందు కోసం ఎన్ని విశ్లేష‌ణ‌లు చేసినా..చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లుగా నే ఉంద‌ని విశ్లేష‌కు అభిప్రాయం.

English summary
Pawan Kalyan try to give clarification on his dialogue on Boarder situation. Pawan comments became sensation in Pakistan Media. He says no need to prove his love on mother land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X