రాష్ట్రపతి తిరుమల పర్యటనలో అనూహ్య ఘటన, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి..!!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపత్రి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రోటోకాల్ పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయానికి భక్తులు ముగ్ధులయ్యారు.
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం రాష్ట్రపతికి ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాంభగీచ బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన కాన్వాయ్ ఆపి మరి అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాకెట్లను పంచారు.

ఆలయం వెలుపల మీతో ఫొటో దిగుతామంటూ టీటీటీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేయగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి రామనారాయణరెడ్డితోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్రపతితో కలిసి ఫొటో దిగారు. సమీపంలోనే ఉన్న ఈవో సింఘాల్, కలెక్టర్ వెంకటేశ్వర్లను రాష్ట్రపతి పిలవడంతో వారూ వచ్చి ఫొటో తీయించుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారం (నవంబర్ 21) తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు. కాగా, అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వెళ్లారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications