శాడిస్టు మొగుడు: ఆ రోజు శోభనం గదిలో ఏం జరిగింది?
Recommended Video

చిత్తూరు: శోభనం గదిలో రాజేష్ భార్య పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించడానికి ముందు చాలా తతంగమే నడిచింది. అతను సంసారానికి పనికి రాడని కొద్ది నిమిషాల్లోనే ఆమె గుర్తించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ విషయాన్ని తన కుటుంబ పెద్దలకు తెలిపింది. వారు రాజేష్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అది తెలిసి రాజేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వధువు తండ్రి ప్రయత్నించాడు. ఆ తర్వాత లోపలకి వెళ్లిన రాజేష్ తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించాడు. తాను సంసారానికి పనికిరానని భార్య శైలజ ముందు అంగీకరిస్తూ అతి దారుణమైన ప్రతిపాదన చేశాడు.

తనతో కాపూరం చేస్తూనే...
సంసారానికి పనికిరాని తనలాంటివాళ్లు ఎంతో మంది వివాహాలు చేసుకుంటున్నారని శైలజతో రాజేష్ చెప్పాడు. దానికి పెళ్లితో తనతో అయినా కాపురం ఎవరితోనైనా చేసుకోవాలనే సూచనను జోడించాడు. తాను సంసారానికి పనికి రాననే విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని వేడుకున్నాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో సైకోగా మారాడని అంటున్నారు.

బాధితురాలు కోలుకుంటోంది...
స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కోలుకుంటోంది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో సంసారం సజావుగా సాగిపోతుందని భావించిన యువతికి తీవ్రమైన దెబ్బ తగిలింది. భర్త మొహంపై పిడిగుద్దులు గుద్ది చిత్రవధ చేసిన విషయం తెలిసిందే.

ఒకటో తేదీన వివాహం....
ఈ నెల 1వ తేది శుక్రవారం తెల్లవారుజామున శైలజాకు రాజేష్‌కు మధ్య వివాహం జరిగింది. అదే రోజు రాత్రి వధువు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. శైలజను అలంకరించి చేసి గదిలోకి పంపారు. కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. అయితే, రాత్రిపూట శోభనం గదిలోంచి కేకలు, అరుపులూ వినిపించాయి. కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.

ఇంతలో గాయాలతో యువతి
శోభనం గదిలోంచి గాయాలతో శైలజ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఇదంతా హారర్ సినిమాలో మాదిరిగా జరిగింది. నిందితుడు రాజేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను సరదా కోసం ఆ విధంగా అన్నానని రాజేష్ చెప్పిన విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు.












Click it and Unblock the Notifications