చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇసుక మాఫియానా... మజాకా: 1700 ఎకరాలు దర్జాగా కబ్జా

|
Google Oneindia TeluguNews

చిత్తూరు:ఇసుక మాఫియా రెచ్చిపోతోంది...తమ అక్రమార్జన కోసం దళిత,గిరిజన, ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ సాండ్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. పైగా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఈ దందాలో భాగస్వాములు కావడం...ఈ అక్రమార్కులకు ప్రభుత్వ అధికారుల తోడ్పాటు లభించడంతో ఇక ఈ అవినీతి అంతులేని కథగా మారిపోయింది.

ఇంతకీ ఈ కబ్జాకోరులు ఇప్పటివరకు స్వాహా చేసిన భూమి ఎన్ని ఎకరాలో తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే...100 కాదు 1000 కాదు ఏకంగా 1700 ఎకరాలకు పైగా ఈ దందాకోరులు కబ్జా చేసారంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఈ భూముల కబ్జాను ఎమ్మార్వో కూడా ధృవీకరించడం గమనార్హం.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం కందాడ పంచాయతీలో జరిగిన భూ భాగోతమిది. వివరాల్లోకి వెళితే...

ఇసుక మాఫియా అడ్డా...వెరీ ఫేమస్

ఇసుక మాఫియా అడ్డా...వెరీ ఫేమస్

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం అంటేనే ఇసుక మాఫియాకు అడ్డాగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బాగా పెట్టింది పేరు. గత ఏడాది ఏప్రిల్ లో పోలీస్ స్టేషన్ వద్ద ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వచ్చిన ఏర్పేడు వాసులపై లారీ దూసుకెళ్లిన ఘటనతో ఈ ప్రాంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధర ఇక్కడ ఇసుకాసురులు రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల అండదండలతో 15 ఏళ్లుగా ప్రభుత్వ, దళిత, గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నట్లు బైటపడింది.తాజాగా జరిపించిన రెవెన్యూ అధికారుల సర్వేలోనూ ఈ విషయం నిర్థారణ అయింది. కందాడ రెవెన్యూ శాఖ పరిధిలోని సర్వే నెంబర్‌ 246 కు సంబంధించి రాచపాళ్యం, వెంకటాపురం, కుక్కలోళ్లకండ్రిగ, వొర్రకాల్వ, సదాశివపురం, శివగిరి కాలనీలోని 1736 ఎకరాల ప్రభుత్వ డికెటి, దళిత, గిరిజనుల భూములను ఇసుక మాఫియా కబ్జా చేసినట్లు తేలింది.

మొత్తం 1736 ఎకరాలు...కబ్జా కోరల్లో...

మొత్తం 1736 ఎకరాలు...కబ్జా కోరల్లో...

ఈ 1736 ఎకరాలలో దళిత, గిరిజనులకు సంబంధించిన భూములు 822 ఎకరాలు కాగా మిగిలిన 914 ఎకరాలు ప్రభుత్వ భూములు. ఈ భూములను ఏర్పేడు మండలంలోని టిడిపి, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు అందరూ సిండికేట్ అయ్యి మరీ ఆక్రమించేయడం గమనార్హం. వీరంతా కలసి రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పాసు పుస్తకాలను సృష్టించి ఒక్కొక్కరూ 15 నుంచి 25 ఎకరాలు ఆక్రమించుకున్నారంటే దందా ఏ మేరకు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

బెదిరింపులు...ప్రలోభాలు...

బెదిరింపులు...ప్రలోభాలు...

బెదిరింపులు...ప్రలోభాలు...స్వాహా ఆక్రమణలకు పాల్పడటమే కాదు ఈ భూముల్లో ఏకంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ మామిడి, అరటి, శనగ పంటలను సైతం పండిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. తమ భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించిన కొంతమంది దళితులను బెదిరించి మరీ భూములను లాగేసుకోవడం గమనార్హం. ఇంకొంతమంది ఇక్కడి దళిత,గిరిజనుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20వేల చొప్పున డబ్బులిచ్చేసి భూములు సొంతం చేసేసుకున్నట్లు తెలిసింది.

కబ్జా నిజమే...ఎమ్మార్వో నిర్థారణ

కబ్జా నిజమే...ఎమ్మార్వో నిర్థారణ

ఈ భూ కబ్జా కేవలం ఆరోపణలు కాదని యదార్థమేనని ఏర్పేడు ఎమ్మర్వో శేషగిరిరావు నిర్థారించారు. కందాడ పంచాయతీ సర్వే నెంబర్‌ 246 కింద 1736 ఎకరాల ప్రభుత్వ, దళిత గిరిజనుల భూములను 20 ఏళ్ల క్రితం నుంచి ఆక్రమించుకుంటున్నారని తమ రికార్డుల్లో తేలిందని చెప్పారు. కొందరు నకిలీ పట్టాలను సృష్టించుకుని ఎన్నో ఏళ్లుగా ఈ భూములను అనుభవిస్తున్నారని తమ విచారణలో తేలినట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. అయితే ఈ భూములను తాము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, ఇప్పటివరకూ గడచిన నెలరోజుల్లో 60ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే తమకు ఒకే సర్వేయర్‌ ఉండడం వల్ల భూముల స్వాధీనంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నట్లు
వెల్లడించారు. అయితే ఈ భూ ఆక్రమణలకు సంబంధించి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు పంపించామని ఎమ్మార్వో శేషగిరిరావు తెలిపారు.

English summary
The sand mafia land grabbing scam in Chittoor district is creating sensation. Revenue officials also confirmed these land scam. The 1736 acres of land illegally grabbed by sand mafia in a single mandal, can understand the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X