ముద్రగడకు శైలజానాథ్ ఆహ్వనం: ఆ 2 కులాలదే ఆధిపత్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 2019 ఎన్నికల్లో ఏ వైఖరిని తీసుకొంటారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ పద్మనాభాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ ఆహ్వనించింది. అయితే ముద్రగడ పద్మనాభం నుండి మాత్రం ఈ విషయమై మాత్రం ఎలాంటి స్సందన రాలేదు.

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది.

ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీలో చేరాలని ఆ పార్టీ ఆహ్వనం పంపింది. ఇతర పార్టీలు కూడ ఇదే దారిలో ప్రయత్నాలను ప్రారంభించాయనే ప్రచారం సాగుతోంది.

ముద్రగడకు కాంగ్రెస్ ఆహ్వనం

ముద్రగడకు కాంగ్రెస్ ఆహ్వనం


ఏపీలో అధికారం రెండు కులాలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. ముద్రగడ పద్మనాభంను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కాపులు, దళితులు కలిసి కాంగ్రెస్ వేదికగా రాజ్యాధికారం సాధించుకోవాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు.

ముద్రగద నిర్ణయమేమిటీ?

ముద్రగద నిర్ణయమేమిటీ?


ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపికి వ్యతిరేకంగా ఆయన అనేక విమర్శలు చేశారు. అయితే ముద్రగడ వెనుక వైసీపీ చీఫ్ జగన్ ఉన్నారని కూడ టిడిపి ఆరోపణలు చేసింది. అయితే 2019 ఎన్నికల్లో ముద్రగద వైసీపీలో చేరుతారా... ఏ పార్టీలో చేరకుండా తటస్థంగానే ఉంటారా.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వనంపై ఏం నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారింది.

రాజకీయానుభవం ఉన్న నేత ముద్రగడ

రాజకీయానుభవం ఉన్న నేత ముద్రగడ


ముద్రగడ పద్మనాభానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన గతంలో కాంగ్రెస్, టిడిపిల్లో పనిచేశారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరలేదు. అయితే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చిన నేపథ్యంలో ఆ రిజర్వేషన్లను అమలు చేయాలని పోరాటం చేస్తున్నారు.

చింతా మోహన్ సూచన

చింతా మోహన్ సూచన

ముద్రగడ పాదయాత్ర చేయకుండా దళితులు, కాపులను ఏకం చేసి రాజ్యాధికారం దక్కించుకునేలా పనిచేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్‌ సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ముద్రగడను పార్టీలోకి ఆహ్వనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వనిస్తే పార్టీకి కలిసివస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Shailajanath invited Mudragada Padmanabham to join in Congress. he spoke to media on Saturday at Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి