సిఐడినే ఆశ్చరానికి గురి చేసిన వడ్డీ మహేష్ నెట్ వర్క్: దేశవ్యాప్తంగా...

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: విశాఖలో రూ.వందల కోట్ల మనీలాండరింగ్‌ కేసుల్లో అరెస్టయిన వడ్డి మహేశ్‌ నెట్‌వర్క్‌ రాష్ట్ర సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలుస్తోంది.

ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదుతో కొద్ది రోజుల క్రితం విశాఖలో వెలుగు చూసిన రూ.వందల కోట్ల మనీలాండరింగ్‌ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్‌, అతని తండ్రి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం 17 మందిపై కేసు నమోదు చేశారు.

Shocking in Mahesh Vaddi case

వీరిలో కీలక నిందితులు వినీత్‌ గొయెంకా, ఆయుష్‌ గోయెల్‌(ఢిల్లీ), వికార్‌ గుప్తా (కోల్‌కత) కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలింపు ప్రారంభిచాయి. ఆచూకీ లభించకపోవడంతో విమానాశ్రయాలకు రెడ్ కార్నర్‌ నోటీసులతోపాటు ఇంటర్‌ పోల్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులిచ్చి ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

కోల్‌కతకు చెందిన ఇద్దరు చార్టెడ్‌ అకౌంటెంట్లు మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారని, కస్టమర్లను సైతం వారే చేకూరుస్తున్నారని మహేశ్‌ విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది.

ఈ సమాచారం ఆధారంగా పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఉన్న చార్టెర్డ్ అకౌంటెట్ ఝా, కోల్‌కతాకు చెందిన ప్రశాంత్ కుమార్‌లను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారని తెలుస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, చెన్నై నగరాల్లో వందల సంఖ్యలో మహేష్ కస్టమర్లు వెలుగులోకి వచ్చారని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shocking in Mahesh Vaddi case.
Please Wait while comments are loading...