కేంద్రం ఆఫర్: నాగార్జున వర్సిటీకి సోలార్ వెలుగులు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి సోలార్ వెలుగులు రానున్నాయి. దేశంలో మొత్తం 18 యూనివర్శిటీలలో సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి నాగార్జున యూనివర్శిటీ ఎంపిక అయ్యింది.

కేంద్ర న్యూ రెన్యువబుల్ ఎనర్జి మంత్రిత్వశాఖ ద్వారా 18.19 కోట్ల ఆర్ధిక సహాయం అందుతుంది. రోజుకు 1.6 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం గా ఉంది. గుజరాత్ లోఎనర్జీ రీసెర్స్ మేనేజ్ మెంట్ సంస్ధ సహాకారంతో డి.పి.ఆర్. తయారుచేసి యూనివర్శిటీ ఎన్.ఆర్.ఇ.కి సమర్పించింది.కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే 8 నుంచి 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తిచేయాలని లక్ష్యం గా నిర్ణయించడమైనది.

Solar system to Nagarjuna University

ఈ పధకం కింద యూనివర్శిటీలో 1.6 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేయడంతోపాటు 10 సోలార్ కార్లు, 100 సోలార్ బైక్ లు యూనివర్శిటీ కొనుగోలు చేస్తుంది. యూనివర్శిటీ ఉన్నతాదికారులు సోలార్ కార్లను వినియోగిస్తారు.

సెక్యూరిటీ సిబ్బందితోపాటు, బోదనేతర సిబ్బంది సోలార్ బైక్ లను ఉపయోగించవలసి ఉంటుంది. యూనివర్శిటీలోని అన్ని ఛాంబర్స్ లోని ఏ.సి.లతోపాటు వర్శిటీ ప్రాంగణంలోని ఇతర విద్యుత్ దీపాలన్ని సోలార్ విద్యుత్ తోనే పనిచేస్తాయి. వర్శిటీ హాస్టల్స్ లో సోలార్ కుకింగ్ సిస్టమ్ తోపాటు సోలార్ వాటార్ హీటర్లను ఉపయోగిస్తారు.వర్శిటీలోని మొక్కలకు సోలార్ పంప్ సెట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు.

యూనివర్శిటీకి సోలార్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే నెలకు సుమారు 18 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.ప్రాజెక్టుకు కేంద్రం నిదులు విడుదల చేస్తే వెంటనే టెండర్లు పిలిచి సంవత్సరం లోపు యూనివర్శిటీ అంతా సోలార్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వర్శిటీ అధికారులు సన్నద్దమవుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union governmnt has granted to install solar power system in Nagarjuna University of Guntur in Andhra Pradesh
Please Wait while comments are loading...