AP SSC Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..!
ఏపీలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు వచ్చే ఏడాది జరిగే బోర్డు పరీక్షలపై అప్డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది జరిగే ఈ పరీక్షల షెడ్యూల్ ను ఇవాళ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదోతరగతి పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఏయే రోజుల్లో ఏ పరీక్ష ఉంటుందో కూడా అధికారులు ఈ షెడ్యూల్ లో ప్రకటించారు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకూ పదో తరగతి పరీక్షల నిర్వహణకు వీలుగా తేదీలు ప్లాన్ చేసారు. ప్రతీ రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు ఉంటాయి. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు), 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ, సంస్కృతం), 20వ తేదీన ఇంగ్లీష్, 23వ తేదీన మ్యాథ్స్, 25వ తేదీన భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), 28న జీవశాస్త్రం (బయాలజీ) పరీక్షలు నిర్వహిస్తారు.

అలాగే మార్చి 30న సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్ష ఉంటుంది. 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2/ ఒకేషనల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. దీంతో పదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు ముగుస్తాయి. కాబట్టి విద్యార్ధులు ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ షెడ్యూల్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అధికారులు అప్డేట్ చేస్తారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications