తక్షణమే దర్గాల అభివృద్ధి చేయకుంటే ఆందోళనే:సుఫీ మతగురువు అలీ రజా హెచ్చరిక

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాష్ట్ర విభజన జరిగాక అంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక వక్ఫ్‌బోర్డు ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో దర్గాలు దయనీయ స్థితిలోనే కొనసాగడం విచారకరమని సుఫీ మతగురువు మహమ్మద్‌ అల్తఫ్‌ అలీ రజా అవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆదాయం పెద్దగా రాని దర్గాలను సైతం ప్రభుత్వం అభివృద్ది చెయ్యాల్సి వుండగా...ఆదాయం బాగా వచ్చే పెదకాకాని హజరత్‌ బాజీబాబా వారి దర్గా వంటి వాటిలో కూడా కనీస వసతులు లేకపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. దర్గాల నుంచి వచ్చే ఆదాయం ద్వారా జీతాలు తీసుకుంటున్న వక్ఫ్‌ అధికారులు...దర్గాల ప్రాంగణాల అభివృద్దిపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదన్నారు.

Sufi Prophet Ali raza warnings about terrorism and religious fanaticism

దర్గాల ద్వారా వచ్చే ఆదాయం వల్ల లబ్ధి పొందుతూ వాటి అభివృద్దికి ఎందుకు ఖర్చు పెట్టడం లేదో భక్తులకు తెలియజేయాల్సిన బాధ్యత వక్ఫ్ అధికారులపై ఉందన్నారు. పెదకాకాని దర్గా విషయంలో వక్ఫ్‌ బోర్డు అధికారులు వెంటనే స్పందించకుంటే తాను భక్తులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని సుఫీ మతగురువు మహమ్మద్‌ అల్తఫ్‌ అలీ రజా ఆ ప్రకటనలో హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Sufi prophet Ali Raza warned that wakf board should develop Dargas , otherwise he will start protest for that.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి