రోజాపై నన్నపనేని: యువభేరీ ఎఫెక్ట్... 'జగన్‌ను అరెస్ట్ చేయాల్సిందే'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసిపి మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హితవు పలికారు.

అక్కడే ట్విస్ట్: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, ఆత్మరక్షణలో జగన్, అందుకే

 రోజాపై నన్నపనేని ఆగ్రహం

రోజాపై నన్నపనేని ఆగ్రహం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆడపిల్లలు లేకపోవడంతో మహిళల సమస్యలను పట్టించుకోవడం లేదని రోజా అనడం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. రోజాకు చంద్రబాబు పేరెత్తే అర్హత లేదన్నారు. కాగా, చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే వారి సమస్యలు తెలియడం లేదని రోజా పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే.

  2018 అక్టోబర్‌లోనే ఎన్నికలు : పవన్, జగన్, బాబు, కెసిఆర్ హడావుడి | Oneindia Telugu
  జగన్‌పై కేసు నమోదు చేయాలి

  జగన్‌పై కేసు నమోదు చేయాలి

  యువతను మోసగించేందుకే వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్‌ యువభేరి నిర్వహిస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు శివనాగమల్లేశ్వరరావు విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆయనపై కేసు నమోదు చేయాలని పలువురు టిడిపి నాయకులుతో కలిసి ఆయన అర్బన్‌ ఎస్పీ విజయరావుకు వినతి పత్రం అందించారు.

   బిజెపి అడగకపోయినా మద్దతిచ్చారు

  బిజెపి అడగకపోయినా మద్దతిచ్చారు

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనికోరారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ఆయన, బిజెపి అడగకపోయినా ఆ ఎన్నికల్లో మద్దతిచ్చి ఎంపీల రాజీనామా డ్రామాను అటకెక్కించారన్నారు.

   వైయస్ కనీసం పదివేలు ఇవ్వలేదు, బాబు 4.20 లక్షలిచ్చారు

  వైయస్ కనీసం పదివేలు ఇవ్వలేదు, బాబు 4.20 లక్షలిచ్చారు

  పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కనీసం పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు 4.20 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు.

   జగన్‌ను అరెస్ట్ చేయాలి

  జగన్‌ను అరెస్ట్ చేయాలి

  యువతకు చంద్రబాబు చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ అనంతపురంలో యువభేరి జరిపే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. నోటికొచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కోరారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party leaders demanded for YSR Congress Party chief YS Jaganmohan Reddy arrest for false allegations on AP CM Chandrababu Naidu and Special Status issue.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి