ఇలా చేస్తే రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం - భక్తులకు TTD ఈవో కీలక సూచన..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠద్వార దర్శనాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఈ సమయంలో దర్శనంకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది.
వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ ఈవో సింఘాల్ కీలక సూచనలు చేసారు. ఈ పది రోజులు కూడా పవిత్రమైనవే, వాటిలో ఏరోజు స్వామివారిని దర్శించుకున్నా ఒకే రకమైన ప్రతిఫలం లభిస్తుందని సింఘాల్ చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం మొదటిసారి ఈ-డిప్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. మొదటి మూడు రోజుల దర్శనాలకుగాను దేశ వ్యాప్తంగా 1,89,000 మంది భక్తులకు పూర్తి పారదర్శక విధానంలో టోకెన్లు జారీ చేశామని తెలిపారు. టోకెన్లు పొందినవారు నిర్దేశిత సమయంలోపు తిరుమలకు చేరుకుంటే రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా చేయిస్తామని సింఘాల్ అన్నారు. ఈ మేరకు మూడు ప్రవేశమార్గాలను కూడా సిద్ధం చేశామన్నారు.

కేటాయించిన సమయానికి వచ్చే భక్తులకు క్యూలైన్‌కు దగ్గరగా ఉన్న ప్రవేశమార్గం ద్వారా లోపలికి పంపుతామని వెల్లడించారు. సమయాని కంటే ముందుగా వచ్చేవారిని మరో రెండు ప్రవేశమార్గాల గుండా క్యూలైన్లోకి తీసుకుని వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏకాదశికి ముందు 29వ తేదీన మాత్రం పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేసి, వారికి అదేరోజు దర్శనాలు ముగిసేలా చూస్తామని సింఘాల్ అన్నారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కలిపి 7,70,000 మందికి పది రోజుల్లో శ్రీవారి దర్శనం కల్పించనున్నామని ఈవో వెల్లడించారు. 182 గంటల్లో 164 గంటలు సామాన్యభక్తులకే కేటాయించామని తెలిపారు. మిగిలిన సమయం మాత్రమే వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించామన్నారు.
ఈ పది రోజుల్లో ప్రివిలేజ్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలను మాత్రం పూర్తిగా రద్దు చేశామని చెప్పారు. నేరుగా వచ్చే ప్రముఖులకే దర్శనం ఉంటుందన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దాదాపు 16 రకాల అన్నప్రసాదాలు, పానీయాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వసతికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. తిరుమలలో భద్రత నిమిత్తం పోలీసు విభాగం నుంచి 2400, టీటీడీ విజిలెన్స్ నుంచి 1100 మంది సిబ్బందిని నియమించామని వెల్లడించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆరు లక్షల మంది శ్రీవారి సేవకుల సాయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఈవో పేర్కొన్నారు.
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications