Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా..!!

Tirumala: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్‌ ఉంది. తిరుపతి అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. వరుస సెలవులు.. వైకుంఠ ఏకాదశి.. నూతన సంవత్సర రద్దీ వేళ టీటీడీ కీలక సూచనలు చేస్తోంది.

తిరుమలలో రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. కంపార్టుమెంట్లు అన్నీ నిండుకొని శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. జనవరి 10వ తేదీ వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. చాలా కాలం తరువాత ఈ స్థాయిలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి తిరుమలకు వస్తున్న వారితో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అక్కడ వాహనాల రద్దీ అధికంగా ఉంది. చెక్‌పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సర్వదర్శనం టోకెన్ల కోసం శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద భక్తులు బారులు తీరారు.

ttd-key-suggestions-amid-huge-devotees-crowd-at-tirumala-due-to-holidays

అయితే, కేవలం 8 వేల టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో చాలా మంది భక్తులు నిరాశతో వెనుదిరిగారు. 30 వేల మందికి పైగా భక్తులు సర్వదర్శనం కోసం తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. తిరుమలలో మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు భక్తులతో నిండిపోయాయి. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక.. 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1న ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో తిరుమలకు రానున్నారు. దీంతో.. టీటీడీ తొలి మూడు రోజుల దర్శనాల కోసం మూడు ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. అదే విధంగా సాధారణ భక్తులకు దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు దర్శనం కోసం టోకెన్ పైన కేటాయించిన సమయానికి క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+