జగన్‌ను వద్దన్నారు, మరి మీ మాటేమిటి, కేసులు ఎత్తివేశారు: వాసిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎలాంటి కేసులనైనా ఎత్తివేస్తున్నారని, అదే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం ఆరోపించారు.

జగన్ ఇలా చేస్తారా: సుజయ కృష్ణ రంగారావు

సభాపతి కోడెల శివప్రసాద రావుతో పాటు మంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, అమర్నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావుపై కేసులు ఎత్తి వేశారన్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాతనే భూమా నాగిరెడ్డిపై కేసులు ఎత్తివేశారన్నారు. ప్రతిపక్షలో ఉంటే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసులు మాఫీ చేయడం పెద్దనేరమన్నారు.

హోదా కోసం యూనివర్సిటీలో అడుగు పెడితే..

హోదా కోసం యూనివర్సిటీలో అడుగు పెడితే..

గతంలో తమ పార్టీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా యూనివర్శిటీలో సమావేశం పెడితే అడ్డుకున్నారని, అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మహానాడును ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు.

టిడిపి ఇలా

టిడిపి ఇలా

అయితే, దీనిపై టిడిపి నేతలు సమాధానం చెప్పారు. యూనివర్సిటీలలో రాజకీయ సమావేశాలు వద్దని చెప్పింది తామేనని, కానీ ఇప్పుడు వెకేషన్ కావడంతో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు.

వీరిపై కేసులు అంటూ..

వీరిపై కేసులు అంటూ..

పలువురిపై కేసులు ఉన్నాయని వైసిపి నేతలు, సాక్షి మీడియా ఆరోపస్తోంది. స్పీకర్ కోడెలపైన నరసారావుపేట పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయని, మండలి వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్యంపై ఉన్న కేసు, డిప్యూటీ సీఎం కేఈపై ఉన్న రెండు కేసులు, మంత్రులు దేవినేనిపై అయిదు కేసులు, కొల్లు రవీంద్రపై మూడు కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు.

కేసు ఉపసంహరణ

కేసు ఉపసంహరణ

తెలుగుదేశం పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టిడిపిలో చేరడంతో ఓ కేసు ఎత్తివేశారని పేర్కొంది. ఆయనతో సహా మరో ఇరవై మందిపై గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని, అది కోర్టు పరిధిలో ఉందని, కానీ టిడిపిలో చేరడంతో కేసును ఉపసంహరించుకుందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Vasireddy Padma slams TDP government for conspiracy cases against YSRCP leaders.
Please Wait while comments are loading...