ఏపీలో టీడీపీ ఆ చర్య, బీజేపీ ఆగ్రహం: రంగంలోకి వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చామని బీజేపీ చెప్పడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇచ్చింది చాలా తక్కువ అని, ప్రచారం చేస్తోంది మాత్రం చాలా ఉందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అంశాల వారీగా లెక్కలతో వర్కింగ్ పేపర్ తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిమగ్నం అయ్యాయి.
Recommended Video

ఏపీకి అరకొరగా నిధులు ఇచ్చిన కేంద్రం, ఇప్పటికే చాలా ఎక్కువ నిధులు ఇచ్చామన్న ధోరణితో ఉందని అంటున్నారు. ఈ మేరకు బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు టిడిపి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

అభినందన లేదా నిరసన
విభజన హామీలకు సంబంధించి పార్లమెంటులో వరస ఆందోళనల అనంతరం కేంద్రం నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఎంతమేరకు ఆచరణలోకి వస్తాయో నిశితంగా పరిశీలించాలని టీడీపీ భావిస్తోంది. రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపు అవన్నీ అమల్లోకొస్తే కేంద్రాన్ని అభినందించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది.

శుక్రవారం తీసుకున్న నిర్ణయాలు సానుకూలమని
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సమక్షంలో అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఇతర నేతల మధ్య శుక్రవారం నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సానుకూలంగా ఉన్నాయనే భావన అంతర్గతంగా వ్యక్తమవుతోంది. అయితే గతంలోనూ ఇలాంటి సంకేతాలిచ్చినా సరైన రీతిలో ఆచరణలోకి రాలేదంటున్నారు. కొన్ని విషయాల్లో ప్రకటనలు వచ్చినా ఆచరణలోకి రాలేదని, మరికొన్ని అమలు చేసినా పూర్తి స్థాయిలో దాని ఫలాలొచ్చేలా చర్యలు తీసుకోలేదని, నిధులు కేటాయించాల్సిన వాటి విషయంలో సరైన స్పందన లేదని చంద్రబాబు భావిస్తున్నారు.

టీడీపీ చర్యతో బీజేపీ ఆగ్రహం
మిత్రపక్షంగా ఉంటూనే కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపల, బయటా టీడీపీ నిరసన వ్యక్తం చేయటం బీజేపీ అగ్రనేతలకు రుచించలేదు. ఏపీలో విపక్షం ఇచ్చిన బంద్ పిలుపునకు కొంత సానుకూలత తెలిపినట్లుగా టీడీపీ వ్యవహరించటమూ వారికి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇవన్నీ జాతీయ స్థాయిలోనూ అందరి దృష్టినీ ఆకర్షించాయి.

నిశ్చితాభిప్రాయానికి రావొద్దని
వీటన్నిటి ఫలితంగా మిత్రపక్షం లేవనెత్తిన వాటిని సామరస్యంగా పరిష్కరించాలన్న వైఖరి శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో కనిపించింది. కేవలం ఆ ఒక్క భేటీలో వెల్లడైన అంశాల ఆధారంగా అప్పుడే ఒక నిశ్చితాభిప్రాయానికి రావటం సరైంది కాదని టీడీపీ భావిస్తోంది. కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.

స్వయంగా రంగంలోకి దిగిన వెంకయ్య
ఇదిలా ఉండగా ఎంపీల ఆందోళనకు తోడు వెంకయ్య నాయుడు జోక్యంతో కేంద్రం కదిలిందని తెలుస్తోంది. మిత్రపక్షాల మధ్య ప్రతిష్టంభనకు ఆయన నడుం బిగించారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని చెప్పి.. ఏపీ అంశాలను ఒక కొలిక్కి తేవాలన్న ఉద్దేశ్యంతో చొరవ చూపారని తెలుస్తోంది. వెంకయ్య స్వయంగా జైట్లీ, షాలను తన వద్దకు పిలిచి, సుజనాను కూడా పిలిచి మాట్లాడారు. అనుమానాలు ఉంటే పరస్పరం కలిసి మాట్లాడుకోవాలన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన అంశాలపై తాను ప్రధాని మోడీకి చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని అమిత్ షా చెప్పారని తెలుస్తోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications