కొలికపూడి మరో రచ్చ..! కేశినేని టార్గెట్ గా వాట్సాప్ లో..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరలో టీడీపీలో ఎక్కువగా వినిపించిన పేరు కొలికపూడి శ్రీనివాస్. గత ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమంతో తెరపైకి వచ్చిన కొలికపూడికి టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అయితే ఆ తర్వాత ఆయన ఏకుమేకుగా మారారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో ఆయనకు సాగుతున్న పోరు ఇవాళ మరోసారి తెరపైకి వచ్చింది.
గత కొంతకాలంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో సై అంటే సై అనేలా వ్యవహరిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇవాళ మరోసారి వాట్సాప్ పోస్టుతో కలకలం రేపారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు షాకిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???, పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్, కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ ఆయన పెట్టిన వరుస పోస్టులు కలకలం రేపుతున్నాయి.

విజయవాడ ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే తిరువూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ కూ, కేశినేని చిన్నికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని వర్గానికి చెందిన స్థానిక నేతల్ని టార్గెట్ చేస్తూ కొలికపూడి పెట్టిన పోస్టులతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతోంది. గతంలో కొలికపూడి తనపై సంచలన ఆరోపణలు చేయడంతో కేశినేని చిన్ని స్వయంగా రంగంలోకి దిగి కౌంటర్లు ఇచ్చారు. అనంతరం వీరిద్దరినీ టీడీపీ అధిష్టానం పిలిపించి అక్షింతలు వేసింది. అయినా వీరిద్దరి తీరులో మార్పు రావడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications