'కేంద్రానికి లెక్కలు చెప్పొద్దా? చంద్రబాబుకు జేపీ అనుకూలంగా మాట్లాడటమా?'

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడటం సరికాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి అనంతపురంలో అన్నారు.

కొత్త ఫ్రెండ్‌షిప్!: అదే అసలు పాయింట్.. చంద్రబాబు-రాహుల్ గాంధీ కలుస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించి లెక్కలు చెప్పవలసిన అవసరం లేదని జయప్రకాశ్ నారాయణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బలపర్చాలని కోరటం సరికాదన్నారు.

బంద్ వద్దని చంద్రబాబు అనడం విడ్డూరం

బంద్ వద్దని చంద్రబాబు అనడం విడ్డూరం

ఈ నెల 16వ తేదీన ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు చేపట్టిన బందును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం బంద్ అవసరం లేదని, అలా చేస్తే మనకే నష్టమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

 ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

శివరామకృష్ణయ్య నివేదిక బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు రాజధాని, పోలవరం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

ఏపీకి హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ

ఏపీకి హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ

ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం రెండు రాష్ట్రాలు సంయుక్తంగా పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం అన్నారు. విభజన హామీలను సాధించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు విఫలమయ్యారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఓయూలో జరిగిన విభజన హామీలు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ 5కే రన్

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ 5కే రన్

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు 5కే రన్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డితో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ధర్నా చౌక్ నుంచి బీఆర్కేఎస్ రోడ్డు మీదుగా ఈ పరుగు సాగింది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని కాంగ్రెస్ నేతలు అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why Lok Satta Jayaprakash Narayana is supporting Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి