టీడీపీలోకి వాణివిశ్వనాథ్: రోజాపై సిద్ధం, చంద్రబాబుకు చిక్కులు తప్పవా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా పైన పోటీకి కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

  Actress Vani Viswanath to Contest Against Roja రోజాపై పోటీకి సై: వాణీ విశ్వనాథ్ | Oneindia Telugu

  జగన్ ప్రజలకు చేసిన ద్రోహంపై వాణీ విశ్వనాథ్

  తాను టీడీపీలో చేరుతానని, అవసరమైతే నగరి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. నిన్నటి తరం హీరోయిన్ వాణీవిశ్వనాథ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందే పొలిటికల్ డైలాగ్‌లు పేల్చుతున్నారు.

   మాటలు పేల్చుతున్న వాణీ విశ్వనాథ్

  మాటలు పేల్చుతున్న వాణీ విశ్వనాథ్

  చంద్రబాబుపై అభిమానంతో టీడీపీలో చేరేందుకు ఆమె ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పైన సినిమా తీస్తే తాను లక్ష్మీపార్వతి పాత్ర పోషించేందుకు సిద్ధమని, ఎన్టీఆర్‌పై రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు పెడితే తాను వర్మ ఇంటిముందు ధర్నాకు దిగుతానని హెచ్చరికలు జారీ చేస్తూ ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కారు.

  నగరిలో నా గెలుపు అలా సులభం

  నగరిలో నా గెలుపు అలా సులభం

  టీడీపీలో చేరతానని వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని కూడా చెప్పారు. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని ఆ నియోజకవర్గం అయితే తన గెలుపు ఈజీ అని వాణీ వ్యాఖ్యానించారు.

  టీడీపీ తీర్థం పుచ్చుకోకముందే

  టీడీపీ తీర్థం పుచ్చుకోకముందే

  టీడీపీ తీర్థం పుచ్చుకోక ముందే వాణీ విశ్వనాథ్ ఇలా నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె మాటలు నగరికే చెందిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు ఏమాత్రం మింగుడుపడని విషయం అంటున్నారు.

  చిక్కులు వస్తాయా?

  చిక్కులు వస్తాయా?

  గాలి ముద్దుకృష్ణమ నాయుడు టీడీపీ సీనియర్ నేత. గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి, రోజా చేతిలో ఓటమి చవిచూశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీకి దిగుతారా లేక వారసులను దింపుతారా చూడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాణీ విశ్వనాథ్ నగరి నుంచి పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. అయితే టీడీపీలోకి వస్తున్నందున కేవలం అవసరమైతే రోజా మీద పోటీ చేస్తానని చెప్పారే తప్పితే కచ్చితంగా చెప్పలేదని, ఇది కేవలం రాజకీయపరమైన మాటలు మాత్రమే అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Will Actress Vani Viswanath took on YSR Congress party MLA Roja in next general elections from Nagari Assembly constituency.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి