Tollywood News: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సుధీర్‌వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విశాఖపట్నంలోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డినట్లు తెలిసింది. సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన కుందనపు బొమ్మ అనే సినిమాలో సుధీర్ అనే కీలక పాత్ర పోషించాడు.
ఈ సినిమా రాఘవేంద్ర రావు సమర్పణలో వచ్చింది. ఇంకా సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ సుధీర్ నటించారు. ఇక సుధీర్ మృతి విషయాన్ని కుందనపు బొమ్మ' సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వెల్లడించారు. సుధీర్ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. సుధీర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.

అయితే సుధీర్ అవకాశాలు రాక జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడా.. పర్సనల్ రీజన్స్ వల్లన అన్నది తేలాల్సి ఉంది. 2022 అసలే సినిమా ఇండస్ట్రీకి కలిసి రాలేదు. చాలామంది నటులు గతేడాది లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏడాది కూడా యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications