ఈ శ్రీకాకుళం యువతి యమా డేంజర్.. 19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు !!
మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. కానీ ఓ కిలేడీ మాత్రం.. 19 ఏళ్లకే 8 మందిని పెళ్లిళ్లు చేసుకొని.. వివాహం జరిగిన వారం రోజుల్లోపే డబ్బుతో ఉడాయిస్తూ మోసాలకు తెరలేపింది. ఈ యమా డేంజర్ యువతి స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..
ఈ మోసాలకు తెరలేపిన యువతిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ముత్తిరెడ్డి వాణిగా గుర్తించారు. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరుతో మగవారిని మోసం చేయడమే ప్రధాన ప్రవృత్తిగా మారింది. పెళ్లి కాని యువకులను లక్ష్యంగా చేసుకుని 'ఎదురు కట్నం' వసూలు చేసి.. పెళ్లయిన వారం రోజుల్లోపే చెప్పాపెట్టకుండా పరారవ్వడం అలవాటుగా చేసుకుంది. ఇటీవలే సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో వాణి కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అయితే వివాహం అనంతరం వరుడితో కలిసి స్వగ్రామానికి రైలులో వెళ్తుండగా.. విజయనగరం రైల్వే స్టేషన్లో 'బాత్రూమ్' పేరుతో దిగి మాయమైంది. మోసపోయిన వరుడి కుటుంబం ఆమె కోసం తీవ్రంగా గాలించింది. చివరికి వాణి ఇచ్చాపురంలోని మేనత్త ఇంటికి చేరుకుందని తెలిసింది. వరుడి కుటుంబం అప్పటికే వాణికి లక్ష రూపాయల ఎదురు కట్నం.. బట్టలు సహా ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులు చెల్లించింది. ఈ మొత్తం పట్టుకొని పరారవడంతో.. ఆమె జాడ కోసం వెతుకుతూ వరుడి కుటుంబ సభ్యులు మేనత్త సంధ్యను సంప్రదించారు.
ఈ క్రమంలోనే వాణి మోసాల వ్యవహారం బయటపడటంతో బాధితులు సంధ్యను నిలదీశారు. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన సంధ్య.. ఆ తర్వాత అదృశ్యమైంది. దీంతో గురువారం వాణి చేతిలో మోసపోయిన నాగిరెడ్డి, కేశవరెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫోటోలు, వీడియోలు పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు. కాగా వాణి తల్లి చిన్నతనం లోనే మరణించడం.. తండ్రి నిర్లక్ష్యంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసినట్టు తెలుస్తోంది.
కానీ గతంలో సంధ్య మైనర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడినా.. అప్పుడు మైనర్ కావడంతో ఫిర్యాదులు రాలేదు. ఇప్పుడు వాణికి 19 ఏళ్లు కావడంతో.. ఆమె గత మోసాలు, పెళ్లి వ్యవహారాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన ఇచ్చాపురం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications