వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అభ్యంతరంలేదని జగన్ యూ టర్న్, కిరణ్‌ను విమర్శిస్తే'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మొదట సమన్యాయం అన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో ఉద్యమాన్ని చూసిన తర్వాత సమైక్యవాదమంటూ మాట మార్చిందని సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు వేర్వేరుగా శుక్రవారం మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే జగన్, ఆయన పార్టీ నేతలు కిరణ్‌ను విమర్శిస్తున్నారని, కిరణ్ సమైక్యాంధ్ర వ్యతిరేకని బురద చల్లడం సరికాదన్నారు. పార్టీ ప్లీనరీలో తెలంగాణకు అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ సమైక్య వాదాన్ని శంకించడమంటే సత్య హరిశ్చంద్రుని సత్య సంధతను, మహాత్ముడి అహింసా వాదాన్ని శంకించడమేనని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసి రెడ్డి అ న్నారు.

ఇటీవలి సర్వేలు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభజనపై పునరాలోచించాలని సూచించారు.

తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదని మంత్రి శైలజానాథ్ చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఆగిపోతుందని భావించడం లేదని, తమ రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని అనుకోవడం లేదని సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాస రావు తప్పుబట్టారు.

English summary
Minister Pitani Satyanarayana on Friday said YSR 
 
 Congress Party took U turn after Seemandhra 
 
 agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X