బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: కరోనాతో చచ్చి సంవత్సరం అయ్యింది, ఆసుపత్రి ఫ్రీజర్ లో శవాలు పెట్టి మరిచిపోయారు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్ 19) దెబ్బతో ప్రపంచ వ్యాప్తంలో కొన్ని లక్షల మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భారతలో కూడా కరోనా వైరస్ దెబ్బతో ఇప్పటి వరకు చాలా మంది పిట్టల్లా రాలిపోయారు. ఇక ఐటీ హబ్ బెంగళూరులో కూడా కోవిడ్ మరణాలు వేలల్లో నమోదు అయ్యాయి. గత ఏడాది బెంగళూరులో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులో స్మశానాలు నిండిపోయి నగర శివార్లలో ప్రత్యేకంగా స్మసానవాటికలు ఏర్పాటు చేసి సామూహిక దహనక్రియలు నిర్వహించారు.

అయితే బెంగళూరు నడిబొడ్డులోని ఇఎస్ఐ ఆసుపత్రిలో కరోనా వైరస్ తో చనిపోయిన సంవత్సరం తరువాత ఇద్దరి మృతేదహాలు పోస్టుమార్టం గదిలోని ఫ్రీజర్ లో నుంచి బయటకు తియ్యడం కలకలం రేపింది. ఏడాది తరువాత ఇద్దరి మృతదేహాలు బయటకు తీసిన తరువాత సంబంధిత అధికారులు సింపుల్ గా ఓ స్టోరీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఆసుపత్రి సిబ్బంది బిజీగా ఉండటం వలన కోల్డ్ స్టోరేజీలో ఉన్న రెండు శవాల గురించి మరిచిపోయారని చెప్పడం దూమరం రేపింది.

Cheating: లవ్ మ్యారేజ్, 9 ఏళ్లు కాపురం, మరొకరితో నిశ్చితార్థం, 420 కహాని, ఫ్యామిలీ ప్యాకేజ్ కేసులు!Cheating: లవ్ మ్యారేజ్, 9 ఏళ్లు కాపురం, మరొకరితో నిశ్చితార్థం, 420 కహాని, ఫ్యామిలీ ప్యాకేజ్ కేసులు!

ఐటీ హబ్ లో కరోనా కలకలం

ఐటీ హబ్ లో కరోనా కలకలం

కరోనా వైరస్ మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ వరకు బెంగళూరులో ఆ మహమ్మారి దెబ్బతో ప్రజలు హడలిపోయారు. కోటి మందికి పైగా జనాబా ఉన్న బెంగళూరు సిటీలో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్నం చేసింది. ఐటీ హబ్ బెంగళూరులో కరోనా వైరస్ దెబ్బతో ఇప్పటికే కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోయారు.

ఫేమస్ ఇఎస్ఐ ఆసుపత్రి

ఫేమస్ ఇఎస్ఐ ఆసుపత్రి

బెంగళూరు సిటీలోని ఇఎస్ఐ ఆసుపత్రులోనే అతి పెద్ద ఆసుపత్రిగా రాజాజీనగర్ ఇఎస్ఐ ఆసుపత్రి గుర్తింపు తెచ్చుకుంది. రాజాజీనగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలో ఇప్పటి వరకు కొన్ని వేల మంది కరోనా వైరస్ వ్యాధి నయం చేసుకోవడానికి చికిత్స చేయించుకున్నారు. కోవిడ్ చికిత్స విఫలం అయ్యి ఇదే ఇఎస్ఐ ఆసుపత్రిలో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 సంవత్సరం తరువాత శవాలు బయటకు తీశారు

సంవత్సరం తరువాత శవాలు బయటకు తీశారు

రాజాజీనగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలో మార్చురీలోని ఫ్రీజర్ లో రెండు మృతదేహాలు బయటకు తీశారు. మార్చురీలో ఉన్న రెండు శవాలు మునిరాజు, దుర్గాగా గుర్తించామని అధికారులు అంటున్నారు. గత ఏడాది లోనే దుర్గా, మునిరాజు కరోనా వైరస్ వ్యాధితో చనిపోయారని, ఇద్దరి మృతదేహాలు మార్చురీలోని ఫ్రీజర్ లో ఉన్నాయని రాజాజీనగర పోలీసులు అంటున్నారు.

బిజీగా ఉండి శవాలు కథ మరిచిపోయారు!

బిజీగా ఉండి శవాలు కథ మరిచిపోయారు!

ఇఎస్ఐ ఆసుపత్రిలో కొత్త మార్చురీ భవనం అందుబాటులోకి వచ్చిందని, తరువాత పాత మార్చురీ భవనం తాత్కాలికంగా నిలిపివేశారని ఓ పోలీసు అధికారి అంటున్నారు. గత ఏడాది రాజాజీనగర్ ఇఎస్ఐ ఆసపత్రిలోకి పాత మార్చురీ భవనంలోని కోల్డ్ స్టోరేజీలోని దుర్గా, మునిరాజు మృతదేహాలు పెట్టారని, తరువాత కొత్త మార్చురీ భవనం ప్రారంభం కావడంతో సిబ్బది బిజీగా ఉండటం వలన ఇద్దరి మృతదేహాలల గురించి మరిచిపోయి ఉంటారని పోలీసు అధికారులు సింపుల్ గా ఓ స్టోరీ చెప్పారు.

క్లీన్ చెయ్యడానికి వెళితే దుర్వాసన

క్లీన్ చెయ్యడానికి వెళితే దుర్వాసన

పాత కోల్డ్ స్టోరేజ్ శుభ్రం చెయ్యడానికి సిబ్బంది వెళ్లిన సమయంలో దుర్వాసన రావడంతో ఇద్దరి శవాలు కోల్డ్ స్టోరేజీలో ఉండిపోయిన విషయం వెలుగు చూసింది. దుర్గా, మునిరాజు కుటుంబ సభ్యుల ఆచూకి తెలుసుకుని వారి అనుమతితో అంత్యక్రియలు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. దుర్గా, మునిరాజు మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించామని సంబంధిత అధికారులు అంటున్నారు. మొత్తం మీద కరోనా వైరస్ వ్యాధితో చనిపోయిన ఇద్దరి శవాలు కోల్డ్ స్టోరేజీలో పెట్టి మరిచిపోవడం బెంగళూరులో కలకలం రేపింది.

English summary
Shock: Bodies of two Covid-19 victims were located a year after their deaths in the mortuary of the ESI hospital in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X