బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: రెండో భార్య, మరదలితో మాజీ ఐఏఎస్ రొమాన్స్ ?, సార్ ల్యాప్ టాప్ లో సీక్రేట్స్, భార్య ఏం చేసింది?

భార్యను మాజీ ఐఏఎస్ అధికారి పక్కన పడుకోపెట్టాలని ప్రయత్నించిన స్యాంట్రో రవికి చెందిన అనేక రహస్యాలు ఉన్న ల్యాప్ టాప్ మాయం కావడం హాట్ టాపిక్ అయ్యింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/రామనగర/మైసూరు: భార్యను మాజీ ఐఏఎస్ అధికారి పక్కన పడుకోపెట్టాలని అనేక ప్రయత్నాలు చేసిన స్యాంట్రో రవికి చెందిన అనేక రహస్యాలు ఉన్న ల్యాప్ టాప్ మాయం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అందమైన భార్య, ఆమె చెల్లిని ప్రభుత్వ అధికారులతో రొమాన్స్ చేయించి తన రైంజ్ పెంచుకుని కోట్లలో డబ్బులు సంపాధించాలని స్యాంట్రో రవి స్కెచ్ వేశాడని అధికారులు అంటున్నారు. భార్యను, మరదలిని అడ్డం పెట్టుకుని అధికారులను లొంగదీసుకోవాలని ప్రయత్నించిన స్యాంట్రో రవికి చెందిన అనేక రహస్యాలు ఆ ల్యాట్ టాప్ లో ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ల్యాప్ టాప్ మాయం కావడం, రిటైడ్ ఐఏఎస్ కోరికలు తీర్చకుండా ఎదురు తిరిగిన రెండో భార్య, మరదలి మీద స్యాంట్రో రగిలిపోయాడని తెలిసింది. స్యాంట్రో రవిని భార్య విషయంలో విధులు దుర్వినియోగం చేసిన ఐటీ హబ్ లోని ఓ పోలీసు అధికారికి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి.

Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!

భార్య, మరదలి మీద అందుకే పగ

భార్య, మరదలి మీద అందుకే పగ

బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో తన రెండో భార్య, మరదలిపై తప్పుడు చోరీ కేసు పెట్టి జైలుకు పంపించానని స్యాంట్రో రవి సీఐడీ అధికారుల విచారణలో అంగీకరించాడు. నా ల్యాప్‌టాప్‌లో కీలకమైన సమాచారం ఉందని, ఆ ల్యాప్ టాప్ నా రెండో భార్య, ఆమె చెల్లలు మాయం చేశారని, అందుకే వాళ్ల మీద తప్పుడు కేసు పెట్టించానని కేఎస్ మంజునాథ్ అలియాస్ స్యాంట్రో రవి సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడని తెలిసింది. అయితే మాయం అయిన ల్యాప్ టాప్ ఎక్కడ ఉంది అంటూ సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

స్యాంట్రో రవి సీక్రేట్ ల్యాప్ టాప్

స్యాంట్రో రవి సీక్రేట్ ల్యాప్ టాప్

కొన్ని రోజుల క్రితం నా ల్యాప్‌టాప్ పోయింది. అన్నిచోట్లా వెతికినా ల్యాప్ టాక్ దొరకలేదు. నేను నా రెండో భార్యను విచారించగా ఆమె నాకు తెలీదు అంటూ తిక్కతిక్క సమాధానాలు ఇచ్చింది. ఆమె నా ఇంటి నుండి ల్యాప్‌టాప్ తీసుకెళ్లిందని తరువాత తెలిసిందని స్యాంట్రో రవి సీఐడీ అధికారులకు చెప్పాడు.

నేను ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇవ్వమని అడగగా నా రెండో భార్య నా మీద ఎదురుదాడి చేసిందని, నీ ల్యాప్‌టాప్ గురించి తనకు ఏమీ తెలియదని చెప్పిందని, ఆ సమయంలో నా భార్యకు ఆమె చెల్లెలు వత్తాు పలికి నీ చేతనైంది చేసుకో అని ఎదురు తిరిగిందని స్యాంట్రో రవి అన్నాడని సీఐడీ ఉన్నత వర్గాలు ప్రముఖ 'కన్నడ పత్రికతో అన్నారు

కేసు పెట్టినా నా రెండో భార్య వెనక్కి తగ్గలేదు

కేసు పెట్టినా నా రెండో భార్య వెనక్కి తగ్గలేదు

ఆ ల్యాప్‌టాప్‌లో నా వ్యాపారానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారం ఉందని, అందుకే ఎలాగైనా ల్యాప్‌టాప్‌ను ఆమె నుంచి స్వాధీనం చేసుకోవాలని తాను ప్లాన్ చేశానని స్యాంట్రో రవి సీఐడీ ముందు చెప్పాడు, స్యాంట్రో రవి అతని స్నేహితుడు, కాటన్‌పేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ సహాయం పొందాడని సీఐడీ అధికారులు అన్నారు.

స్యాంట్రో రవి రెండో భార్య, ఆమె చెల్లెలి మీద తప్పుడు దోపిడీ కేసు పెట్టి ఆ ఇద్దరిని అరెస్టు చేస్తే ల్యాప్‌టాప్ ఇస్తుందని ప్లాన్ వేశామని స్యాంట్రో రవి సీఐడీ ముందు అంగీకరించాడు. నవంబర్ 23వ తేదీన వారిద్దరూ బెంగళూరులో ఉన్నారు. ఆ సమయంలో భార్య, మరదలి మీద కేసు నమోదు చేసినా కూడా వాళ్లు ల్యాప్‌టాప్ ఇవ్వలేదని స్యాంట్రో రవి సీఐడీ అధికారులకు చెప్పాడన తెలిసిందది.

నేను దాన్ని పెళ్లి చేసుకోలేదని రివర్స్

నేను దాన్ని పెళ్లి చేసుకోలేదని రివర్స్

నేను ఆమెకు నా ల్యాప్‌టాప్ ఇస్తే వదిలేస్తానని చెప్పినా నా రెండో భార్య నా మాట వినలేదని స్యాంట్రో రవి అంటున్నాడు. ఆమెతో తనకు పెళ్లి కాలేదని, ఆమెను ఉంచుకున్నానని స్యాంట్రో రవి బాంబు పేల్చాడని తెలిసింది. డబ్బు కోసం ఆమె నాపై తప్పుడు ఫిర్యాదు చేసింది. తానేమీ తప్పు చేయలేదని స్యాంట్రో రవి అంటున్నాడని సీఐడీ అధికారులు తెలిపారు.

నా భర్త హైటెక్ వ్యభిచారం చెయ్యాలని చెప్పాడు

నా భర్త హైటెక్ వ్యభిచారం చెయ్యాలని చెప్పాడు

స్యాంట్రో రవి మీద అతని రెండో భార్య మైసూరులో కేసు పెట్టింది. మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు తాను పడక సుఖం ఇవ్వాలని తన భర్త ఒత్తిడి చేశాడని, తనతో వ్యభిచారం చేయించాలని చూశాడని, ప్రాణాలు తీస్తానని బెదిరించి తన మీద దాడి చేశాడని, తన మీద అత్యాచారం చేయించడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ స్యాంట్రో రవి మీద అతని రెండో భార్య ఫిర్యాదు చెయ్యడంతో మైసూరులో అతని మీద కేసులు నమోదు అయ్యాయి.

మైసూరు టూ బెంగళూరు

మైసూరు టూ బెంగళూరు

కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు మైసూరు నుంచి స్యాంట్రో రవిని బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలోకి పిలుచుకుని వచ్చి ఇక్కడే విచారింయారు. కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో భార్యపై తప్పుడు కేసు పెట్టించానని స్యాంట్రో రవి అంగీకరించాడని సీఐడీ అధికారులు తెలిపారు.

కాటన్‌పేట పోలీస్ స్టేషన్‌లో సాంత్రో రవి భార్య, ఆమె చెల్లెలి మీద తప్పుడు దోపిడీ కేసుకు సంబంధించి సీసీబీ పోలీసులు ప్రత్యేకంగా మరో కేు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తప్పుడు కేసుకు సంబంధించి స్యాంట్రో రవి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి సీఐడీ అధికారులు ఆయన కేసు విచారణ సందర్భంగా సీసీబీకి నివేదిక సమర్పించే అవకాశం ఉందని తెలిసింది.

ఇన్స్ పెక్టర్ కు సినిమా

ఇన్స్ పెక్టర్ కు సినిమా

మాయం అయిన ల్యాప్‌టాప్ గురించి స్యాంట్రో రవి రెండో భార్యను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఆ ల్యాప్ టాప్ గురించి తనకు తెలీదని ఆమె సీఐడీకి చెప్పిందని తెలిసింది. మాయం అయిన ల్యాప్‌టాప్ ఎవరి దగ్గర ఉందో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ల్యాప్‌టాప్‌లోని రహస్య సమాచారం గురించి స్యాంట్రో రవి కూడా నోరు విప్పలేదని తెలిసింది.

మాయం అయిన ల్యాప్‌టాప్‌కు సంబంధించి సమాచారం సేకరిస్తున్నామని సీఐడీ అధికారులు తెలిపారు. స్యాంట్రో రవి రెండో భార్య మీద తప్పుడు దోపిడీ కేసు పెట్టి స్యాంట్రో రవికి సహకరించిన ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ప్రవీణ్‌ ను సీఐడీ లేదా సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలిసింది.

English summary
The husband who said that he wants to have a romance with his second wife with IAS. Santro Ravi laptop with secret information is missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X