పళ్ళు తోముకోదు, ఏడాదికోసారి స్నానం: భర్త ఏం చేశాడంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

తైపీ: తన భార్య నుండి తనకు విడాకులు ఇవ్వాలని ఓ భర్త కోర్టును ఆశ్రయించారు. ఏడాదికి ఒక్క రోజే తన భార్య స్నానం చేస్తోందని భర్త కోర్టులో చెప్పేశాడు. దీంతో కోర్టులో భర్త చెప్పిన విషయాలను విన్న న్యాయమూర్తులు అవాక్కయ్యారు.

వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నందునే తాను విడాకులు కోరుతున్నట్టు భర్త కోర్టుకు తెలిపారు. అయితే భర్త చేస్తున్న ఆరోపణలను భార్య మాత్రం కొట్టిపారేసింది. తన భర్త చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె తేల్చి పారేసింది.

Man divorces wife for this bizarre reason

తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ తైవాన్‌ పౌరుడొకరు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. తన భార్య ఏడాదికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని చెప్పి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

అంతేకాదు ఉదయాన్నే పళ్లు తోముకోదని, శిరోజాలను కూడా శుభ్రంగా ఉంచుకోదని తెలిపాడు. తాము ప్రేమించుకునేటప్పడు వారానికి ఒకసారి స్నానం చేసేదని, పెళ్లైన తర్వాత పరిస్థితి దారుణంగా మారిందన్నాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్నానమాడేదని, దీని కోసం 6 గంటల సమయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Personal hygiene is an important aspect of our lives and one should never neglect it as that can even put an end to your relationship.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి