డా. రెడ్డీస్‌కి మరో షాక్: దువ్వాడ ప్లాంటు ప్రభావంతో షేర్ల పతనం

Subscribe to Oneindia Telugu

ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌(డా. రెడ్డీస్ ల్యాబ్స్)కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌, విశాఖ దగ్గర్లోని దువ్వాడ ప్లాంటుకి సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ ఓఏఐతో కూడిన ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్స్‌పెక్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌)ను జారీ చేసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో డా. రెడ్డీస్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.

ట్రేడర్ల అమ్మకాలతో 4.5 శాతం పతనమైంది. ఫార్మా సెక్టార్‌లో ఓఏఐ అంటే నియంత్రణా సంబంధిత చర్యలకు ఉపక్రమించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అబ్జర్వేషన్ నమోదు

అబ్జర్వేషన్ నమోదు

2017 ఫిబ్రవరి-మార్చి తనిఖీలలో యూఎస్‌ఎఫ్‌డీఏ దువ్వాడ ప్లాంటుపై 13 అబ్జర్వేషన్స్‌ను నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి రెడ్డీస్‌ ఇంజక్టబుల్స్‌ను రూపొందిస్తోంది.

వివరణ కోరిన రెగ్యూలేటరీ..

వివరణ కోరిన రెగ్యూలేటరీ..

దాదాపు 2015 నుంచి వెలిబుచ్చుతున్న అభ్యంతరాల నివారణకు కంపెనీ తగిన చర్యలు చేపట్టలేదంటూ యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై డా. రెడ్డీస్‌ను వివరణ కోరామని మార్కెట్‌ రెగ్యులేటరీ పేర్కొంది. కాగా, తాజా రిపోర్ట్‌పై సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఫైలింగ్‌లో ఇలా..

ఫైలింగ్‌లో ఇలా..

కాగా, నవంబర్ 21, 2017న విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉత్పాదక కేంద్రానికి సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌ అందినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రెడ్డీస్‌ తెలిపింది. కానీ, సంస్థ తనిఖీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పింది.

మూడు హెచ్చరికలు

మూడు హెచ్చరికలు

ఇది ఇలావుంటే.. అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ కంపెనీకి మూడు హెచ్చరిక లేఖను జారీ చేసింది. దువ్వాడ ప్లాంట్‌ సహా దాని తనిఖీ బృందాలు ఆమోదయోగ్యమైన సమస్యలను ఉన్నట్టు గుర‍్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 25న బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు సోమవారం తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shares of Dr Reddy's Laboratories remained under pressure for the fourth straight session and further fell by nearly 3 per cent today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి