బంగారం విషయంలో ఆ పని చేస్తే కొంపలంటుకుంటాయ్..!!
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కిందటి రోజుతో పోల్చుకుంటే రెండు శాతం వరకు వీటి రేట్లల్లో పెరుగుదల కనిపించింది. ఇక ఇప్పట్లో తగ్గే పరిస్థితులు లేకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, దేశీయ డిమాండ్ అలాగే మారుతున్న కరెన్సీ రేట్ల ప్రభావం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటి వైపు జనం మొగ్గుచూపడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
కళ్లు బైర్లు కమ్మేలా..
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండు శాతానికి పైగా పెరిగి కొత్త రికార్డును సృష్టించాయి. బంగారం ఔన్సుకు 4,682 డాలర్లకు చేరువైంది. అదే సమయంలో వెండి 3.79 శాతం పెరిగి ఔన్సుకు 93 డాలర్ల వద్ద స్థిరపడింది. ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,47,280గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,35,000 వద్ద నిలిచింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.39 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,47,670 వద్ద ట్రేడ్ అయింది.

తగ్గేదేలేదంటోన్న..
సిల్వర్ ఫ్యూచర్స్ 2.08 శాతం పెరిగి కిలోకు రూ. 3,16,721కి చేరుకుంది. భారత మార్కెట్‌లో వెండి కిలోకు రూ. 10,000 మేర పెరిగి రూ. 3,15,000 వద్ద నమోదైంది. ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,35,100 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 1,47,430 పలికింది. అహ్మదాబాద్, పుణెలో 22 క్యారెట్లకు రూ. 1,35,050, 24 క్యారెట్లకు రూ.1,47,330 నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,35,000 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,280కి చేరింది.
పెరుగుదలకు నో బ్రేక్..
బంగారం, వెండి ధరల పెరుగుదల ఇక్కడితో ఆగేది కాదు. మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ధరలు తగ్గుదల ఉండదని స్పష్టం చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పడిపోతాయనే పుకార్లను నమ్మవద్దని హెచ్చరించారు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూస్తే బంగారం ధరలు మరింత పెరగడానకే అవకాశాలు ఉన్నాయే తప్ప ఇప్పట్లో తగ్గబోవని తేల్చి చెబుతున్నారు. బంగారం రేట్లు తగ్గొచ్చనే ఉద్దేశంతో వాటిని అమ్ముకోవద్దని, అలా చేస్తే నష్టపోతారని నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.
వెండిలో పెట్టుబడులు పెట్టొచ్చా?
బంగారానికి ప్రత్యమ్నాయంగా సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF) లలో పెట్టుబడులు పెట్టాలని ఛాయిస్ వెల్త్ రీసెర్చ్ హెడ్ అక్షత్ గార్గ్ కొత్త పెట్టుబడిదారులకు సూచించారు. విభిన్న పోర్ట్‌ఫోలియోకు ఇది తోడ్పడుతుందని అన్నారు. సిల్వర్ ఈటీఎఫ్‌లు ఉన్నవారు ఇప్పుడు అమ్మకాలు చేయవద్దని గార్గ్ సూచించారు. సెంట్రల్ బ్యాంకుల నిల్వలు, ద్రవ్య సడలింపు, వెండి పారిశ్రామిక డిమాండ్ కారణంగా బంగారం, వెండి పెట్టుబడిదారులకు చాలా కీలకమైనవిగా అభివర్ణించారు.
బంగారం రేట్లు మరింత..
గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సైతం ఇదే సూచనలు ఇచ్చింది. బంగారం రేట్లు మరింత పెరుగుతాయని కమోడిటీస్ రీసెర్చ్ కో హెడ్ డాన్ స్ట్రుయివెన్ స్పష్టం చేశారు. బంగారం కొనుగోళ్లు, వాటి నిల్వలను మరింత సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటోన్నాయని, దీని ప్రభావం రేట్లు మరింత పెరగడానకే దారి తీస్తాయని వివరించారు. దీనికి అనుగునంగా పసిడి ధర ఔన్స్‌కు 4,900 డాలర్లకు చేరిన విషయాన్ని గుర్తు చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications