అంచనాలకు మించి దూసుకెళ్లిన భారత ఆర్థిక వ్యవస్థ!
India Q2 GDP: భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి(జులై నుంచి సెప్టెంబర్) సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి రేటుతో పెరిగింది. బలమైన వినియోగదారుల వ్యయం (కన్స్యూమర్ స్పెండింగ్), పటిష్టమైన తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్) కారణంగా వృద్ధి రేటులో ఈ పెరుగుదల నమోదైంది.
నామినల్ జీడీపీ వృద్ధి 8.7 శాతం
ప్రపంచ వాణిజ్యంలో అధిక అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఈ జీడీపీ వృద్ధిని సాధించింది. దీనికి ముందు త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నామినల్ జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు) రియల్ జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఇది 6.1 శాతంగా ఉంది.

రంగాల వారీగా వృద్ధి రేటు
*తయారీ రంగం - 9.1 శాతం
*నిర్మాణ రంగం -7.2 శాతం
*ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు- 10.2 శాతం
*వ్యవసాయం, సంబంధిత రంగాలు - 3.5 శాతం
*విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసులు -4.4 శాతం
తయారీ , సేవా రంగాల అద్భుత ప్రదర్శన
భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు తయారీ రంగం, సేవా రంగంలోని బలమైన వృద్ధి నాయకత్వం వహించిందని స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రియల్ జీవీఏ (Gross Value Added) వృద్ధి 8.1 శాతంగా నమోదైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ విభాగంలో రెండంకెల జీవీఏ వృద్ధి రేటు నమోదైంది. వ్యవసాయం, సంబంధిత రంగాలలో మాత్రం కొద్దిగా నెమ్మదైన వృద్ధి నమోదైంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications