వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: పీఎంఏవై కింద ఇల్లు కొంటే ఎంతో చౌక.. జీఎస్టీ కేవలం 8%

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తొలిసారి గృహ కొనుగోలు చేయాలని భావించే పౌరులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన కింద క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్‌(సీఎల్‌ఎస్‌ఎస్‌) వాడుకుని గృహాలు కొనుగోలు చేసే వారికి జీఎస్టీ రేటును 12 శాతం నుంచి ఎనిమిది శాతానికి తగ్గించింది. పౌరుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.18 లక్షల వరకు ఉంటే తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి రూ.2.7 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. సీఎల్‌ఎస్‌ఎస్‌కు అర్హులు కాని వారు, 12శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని తెలిపింది.

క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్ కింద 150 చదరపు మీటర్ల వరకు కార్పెట్‌ ఏరియాను కొనుగోలు చేసుకోవచ్చు. కార్పెట్‌ ఏరియా అంటే గోడల వెలుపల ఉన్న ప్రాంతం. గత నవంబర్‌లోనే సీఎల్‌ఎస్‌ఎస్‌ కింద అర్హులైన గృహాలకు కార్పెట్‌ ఏరియాను పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఇది కేవలం మధ్యతరగతి ఆదాయ వర్గం(ఎంఐజీ) వారికే వర్తిస్తుంది.

రూ.12 లక్షల్లోపు, 18 లక్షల వరకు వేర్వేరు క్యాటగిరీ
మధ్యతరగతి ఆదాయ వర్గాన్ని కూడా కేంద్రం రెండు విభాగాలుగా వర్గీకరించింది. రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం గల వారిని ఎంఐజీ-1 కేటగిరీ కిందకి తెచ్చింది. వీరికి రూ.9 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. వీరికి నాలుగు శాతం ఇంటరెస్ట్‌ సబ్సిడీ అందుబాటులో ఉంది. రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం గల వారిని ఎంఐజీ-2 కేటగిరీ కిందకి తెచ్చి.. వీరికి రూ.12 లక్షల రుణం అందిస్తున్నారు. వీరికి మూడు శాతం ఇంటరెస్ట్‌ సబ్సిడీని అందిస్తుంది. 2022 వరకు పట్టణ ప్రాంతంలోని పేదలందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పనిచేస్తోంది.

Pre-budget cheer for home buyers: 8% GST on houses under PMAY effective today

రూ.30 - 35వేల వేతనం ఉంటే రూ.3 లక్షలు డౌన్ పేమెంట్

ఉదాహరణకు మీరు ఉంటున్న నగరంలో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే మీ ఆదాయానికి అనుగుణంగా బ్యాంకు ఇచ్చే రుణాన్ని బట్టి ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందో ముందుకు నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. రూ.30 నుంచి రూ.35 లక్షల విలువల గల ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే నెలవారీగా రూ. 30 వేల నుంచి రూ.35 వేల వేతనం పొందే వారు ముందుగా డౌన్ పేమెంట్‌గా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి ధరపై 90 శాతం రుణంగా లభిస్తుంది. నెలసరి వాయిదా రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.2.25 లక్షల లబ్ధి చేకూరుతుందని నిపుణులు అంటున్నారు.

Pre-budget cheer for home buyers: 8% GST on houses under PMAY effective today

రూ.2.5 లక్షల వేతనజీవులకు ఇలా రుణం మంజూరు
నెలవారీగా రూ. లక్షకు పైగా వేతనం పొందుతున్న వారు రూ.70 - 75 లక్షల విలువ గల ఇల్లు కొనుగోలు చేయాలంటే ముందుగా రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. ఇంటి ధరపై బ్యాంకులు 70 - 80 శాతం రుణం మంజూరు చేస్తాయి. దానిపైనా పీఎంఏవై పథకంలో రూ.2.25 లక్షల ప్రయోజనం లభిస్తుంది. ఇక అత్యధికంగా రూ. 2.5 లక్షల వేతనం సంపాదించే వారు ఇంటి ధరలో సుమారు 2.5 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది అదీ ఇంటి ధర రూ.75 లక్షల పై మాటే అయితే సుమా. అందులో 75 శాతం మేరకు బ్యాంకులు రుణాలిస్తాయి.

English summary
A lot of people are hoping for a populist budget from finance minister Arun Jaitley next week. And after its recently concluded meeting, the Goods and Services Tax (GST) council have given a section of home buyers something to cheer about.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X