బాబ్జీ అవసరమా..? యువకుడితో గొడవ, కత్తి తీసుకువచ్చి దాడి, ఎక్కడ, ఎందుకంటే..?
అసలే పెట్రో ధర భారం గుదిబండగా మారుతోంది. పెట్రోల్ కొట్టించడానికి జనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పెట్రోల్ బంకు సిబ్బందితో వాహనదారులకు గొడవ సహాజమే. కొన్ని చోట్ల జీరో చూసుకోవాలని కోరుతుంటారు. మరికొందరు అలాగే కొట్టేస్తారు. దీంతో వాహనదారులు తాము నష్టపోయామని అంటున్నారు. అలా తూర్పు గోదావరి జిల్లాలో కూడా గొడవ జరిగింది. అయితే వాహనదారుడు మాత్రం తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయాడు. సిబ్బందే కాదు.. యజమానితో కూడా గొడవకు దిగాడు. ఇంటికెళ్లి మరీ కత్తి తీసుకొచ్చాడు. దాడి చేయడంతో.. యజమాని తృటిలో తప్పించుకున్నాడు.. బతుకు జీవుడా అంటూ పరుగు తీశాడు.

రంగంలోకి గుర్రం బాబ్జీ
తూర్పుగోదావరి కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక పెట్రోల్ బంకు ఘటన జరిగింది. పెట్రోల్ పోయించడానికి యువకుడు వచ్చాడు. కారణం ఏంటో కానీ.. వారితో గొడవ జరిగింది. పెట్రోల్ పాయింట్ల విషయంలో ఇష్యు జరిగి ఉంటుంది. వారి మధ్య గొడవ తగ్గడం లేదు. అక్కడే యజమాని గుర్రం బాబ్జి ఉన్నాడు. ఆయన రంగంలోకి దిగాడు. సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యువకుడు వినిపించుకోలే.. మాట మాట పెరిగింది. ఆ సమయంలో యువకుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. కానీ బాబ్జీపై కోపం మాత్రం అలాగే ఉంది.

కత్తి తీసుకుని వచ్చిన యువకుడు
ఆ
యువకుడు
నేరుగా
ఇంటికి
వెళ్లాడు.
కత్తి
తీసుకువచ్చి
పెట్రోల్
బంక్
యజమానిపై
దాడికి
పాల్పడ్డాడు.
ఏం
జరుగుతుందో
ఊహించేలోపు
అటాక్
జరిగింది.
ఆ
దాడి
నుంచి
బాజ్జీ
తృటిలో
తప్పించుకున్నాడు.
స్వల్ప
గాయంతో
బయటపడి..
ఊపిరి
పీల్చుకున్నాడు.
ఆ
యువకుడు
ఇలా
దాడి
చేస్తారని
అనుకోలేదని
తర్వాత
మీడియా
ప్రతినిధులతో
చెప్పారు.
ఈ
ఘటన
మాత్రం
చర్చకు
దారితీసింది.

పాత కక్షలు ఉన్నాయా..?
బాబ్జీపై దాడి చేసిన యువకుడు అల్లవరం మండలం తమ్మలపల్లికి చెందినవాడిగా గుర్తించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాబ్జీ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు విచారించనున్నారు. కానీ ఈ ఘటన మాత్రం ఆశ్చర్యం కలిగించింది. బంకు యజమానిపై కత్తితో దాడి చేయడం ఏంటీ అని అక్కడున్న వారు అభిప్రాయ పడుతున్నారు. వారికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అని మరికొందరు అంటున్నారు. కానీ దీనికి సంబంధించిన సమాధానం పోలీసులే చెప్పాల్సి ఉంటుంది.