వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? మందులకు బదులు ఈ చిన్నచిట్కాలు ట్రై చెయ్యండి!!

|
Google Oneindia TeluguNews

చాలామంది భరించలేని తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది? తల నొప్పికి గల కారణాలు ఏమిటి? అనేది పక్కన పెడితే చాలా మందికి తలనొప్పి విభిన్న రీతిలో వస్తుంది. కొంతమందికి తలలో పొడిచినట్టుగా, కొంతమందికి తల, కళ్ళు లాగుతున్నట్లుగా రకరకాలుగా తల నొప్పి బాధ పెడుతుంది. విపరీతమైన తలనొప్పి వల్ల, విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. విపరీతమైన తలనొప్పి ఉన్న సమయంలో ఎవరితోనూ మాట్లాడ బుద్ధి కాదు. ఏ పనీ చేయబుద్ధి కాదు. శబ్దాలు విన బుద్ధి కాదు. కొంతమందికి తల తిప్పినట్టుగా ఉంటుంది. ఇలా రకరకాలుగా తలనొప్పి మనుషులను బాధపెడుతుంది.

తలనొప్పికి కొన్ని కారణాలు ఇవే

తలనొప్పికి కొన్ని కారణాలు ఇవే


అయితే తలనొప్పికి కొన్ని కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. విపరీతంగా పని ఒత్తిడి పెరిగితే తల నొప్పి వస్తుందని చెబుతున్నారు. ఏదైనా సమస్య గురించి పదేపదే ఆలోచించిన తలనొప్పి అనిపిస్తుందని, జన్యుపరమైన కారణాల తోనూ కొందరిలో తలనొప్పి వస్తుందని చెబుతున్నారు. తలలోని రక్తనాళాలు లో రక్తప్రసరణ సరిగ్గా జరగక పోతే తల నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోకపోవడం కూడా తలనొప్పికి కారణమని చెబుతున్నారు. ఇక ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం కూడా తలనొప్పికి కారణంగా కనిపిస్తుంది.

తలనొప్పి నుండి బయట పడటానికి నేచురల్ చిట్కాలు ఇవే

తలనొప్పి నుండి బయట పడటానికి నేచురల్ చిట్కాలు ఇవే

ఇక తలనొప్పి పదే పదే వేధిస్తుంటే పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు వేసుకోవడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే తలనొప్పి నుంచి బయట పడడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయని వాటిని పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. తలనొప్పి నుంచి బయటపడడానికి అన్నిటికంటే ముందు కాస్త రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రశాంతంగా పడుకుంటే విపరీతమైన తలనొప్పి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. ఇక విపరీతంగా తలనొప్పి ఉన్నవారు తలనొప్పి తగ్గాలంటే క్యారెట్, కీరా జ్యూస్ లను తీసుకోవడం ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు.

తలనొప్పి ఎక్కువగా ఉంటే ఈ పని చేసి చూడండి

తలనొప్పి ఎక్కువగా ఉంటే ఈ పని చేసి చూడండి


తలనొప్పి ఎక్కువగా ఉంటే నిమ్మకాయ రసం తోటి కూడా కొంతమేరకు ఉపశమనం వస్తుందని, గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి దానిని తీసుకుంటే తలనొప్పి తగ్గుతుందని చెబుతున్నారు. ఇక అంతే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణం అవుతుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి కావలసిన నీటిని తప్పనిసరిగా తాగాలని సూచిస్తున్నారు. నిత్యం 4 నుండి 5 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలని అంటున్నారు.

తలనొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే చెయ్యాల్సింది ఇవే

తలనొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే చెయ్యాల్సింది ఇవే

ఇక తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అరటిపండు, పైనాపిల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మంచి జీవన విధానం తోటి, చక్కని ఆహారపు అలవాట్లతోటి తలనొప్పికి చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. రాత్రిళ్ళు ఫోన్ లలో తలపెట్టి నిద్ర పోకుండా ఉంటే కూడా తలనొప్పి బాదిస్తుందని అంటున్నారు. అందుకే సాధ్యమైనంత తక్కువగా మొబైల్స్ ఉపయోగించండి. తలనొప్పిగా ఉందని విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. సహజసిద్ధంగా తల నొప్పిని తగ్గించుకునే మార్గాన్ని చూడాలని, అదే దీర్ఘకాలిక తల నొప్పి బాధ పెడితే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!!health tips: డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!!

English summary
Suffering from unbearable headache? Try these tips instead of drugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X