వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

|
Google Oneindia TeluguNews

మనిషికి ఓ పూట ఆహారం లేకపోయినా ఫర్వాలేదు కానీ.. నిద్ర మాత్రం తప్పుకుండా ఉండాలి. మనిషి ఒక్క రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. యుక్త వయస్సులో చాలా మంది తక్కువ నిద్ర పోతుంటారు. ఇది దీర్ఘకాలం చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిగా నిద్ర లేకుంటే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

గుండె పోటు

గుండె పోటు

బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్ , కంటి సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడతాయి. మీరు రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే 7 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారంటే.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అలా అని ఎక్కువ నిద్ర పోయినా ప్రమాదమేనట.

7-8 గంటల నిద్ర

7-8 గంటల నిద్ర

8 గంటల కంటే ఎక్కువ నిద్ర మంచిది కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. అంటే ఆరోగ్యమైన జీవితం కోసం రోజుకు 7-8 గంటల నిద్ర అనేది చాలా అవసరమని చెబుతున్నారు. ఇండియా సహా చాలా దేశాల్లో గుండెపోటే మరణాలకు నెంబర్ వన్ కారణం నిద్ర లేకపోవటమేనట. కొన్నేళ్ల క్రితం చేసిన ఓ అధ్యయనం ప్రకారం..ఇండియాలో ప్రతి లక్షమందిలో 272 మంది ప్రాణాలు కేవలం గుండెపోటుతోనే పోతున్నాయని తేలింది.

ఎవరు ఎంత సేపు నిద్ర పోవాలి

ఎవరు ఎంత సేపు నిద్ర పోవాలి

అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయని వివరిస్తున్నారు.

మధుమేహం

మధుమేహం

యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని తెలుస్తోంది.

English summary
Studies have shown that getting less than 7 hours of sleep increases the risk of heart attack. Lack of sleep can cause many problems besides heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X