
కింద ఇవ్వబడిన ఫోటోలో తన ఏడేళ్ల సోదరుడు హిలాల్‌తో కనిపిస్తున్న హిదయ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుడి భిన్న రూపాన్ని చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. అభం, శుభం తెలియని ఈ బాలుడు ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు అతని తల మిగతా పిల్లలతో పోలిస్తే పెద్దగా మారడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. పలు పరీక్షల అనంతరం ఏడేళ్ల హిలాల్ హైడ్రోసెఫాలస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉండే ఏడేళ్ల వయస్సులో అతనికి ఈ శారీరక రుగ్మత ఇబ్బందులు కొని తెచ్చింది.
'ఇప్పటి వరకు మేం అతని (హిలాల్) నుంచి విన్న పదాలు అమ్మ, అప్ప మాత్రమే. ఆ పదాలు కూడా అంత స్పష్టంగా పలకలేడు. ఏడేళ్ల వయస్సులో ఏ పిల్లవాడైనా ఆడుకుంటాడు. పాఠశాలకు వెళ్తాడు. కానీ మా హిలాల్‌ను ఇలా చూసి మేం బాధపడుతున్నాం. అతను సరిగ్గా మాట్లాడలేడు. తలను తిప్పలేడు. లేచి నడవలేడు. అతని భవిష్యత్తు కోసం మేం ఎన్నో కలలు కన్నాం. కానీ ఇప్పుడు అంతా కల్లలు అయిపోయినట్లుగా కనిపిస్తోంద'ని హిలాల్ కుటుంబం తమ బాధను చెబుతోంది.

హైడ్రోసెఫాలస్.. ప్రాణాంతక వ్యాధి. మెదడులో అధిక ద్రవం చేరడం వల్ల ఇలా అవుతుంది. దీంతో బయటకు అతని తల పూర్తిగా వాచిపోయింది. అంతర్గతంగా అతని మెదడులోని పర్యావసన ఒత్తిడి అతని చర్యలన్నింటిని ప్రభావితం చేస్తుంది. హిలాల్‌కు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు ఈ వ్యాధిని గుర్తించినప్పటికీ ఆపరేషన్ వంటి చికిత్సలు చేసేందుకు ఆ వయస్సు సరిపోదు. ఆపరేషన్ ప్రమాదకరమైనది. అతను కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న వయస్సులో ఆపరేషన్ చేయించేందుకు తల్లిదండ్రులు భయపడ్డారు. అయితే ఇప్పుడు హిలాల్‌కు ఆపరేషన్ చేయాల్సిన సమయమని చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రి వైద్యులు అభిప్రాయపడ్డారు. హిలాల్‌కు ఆపరేషన్ జరిగినా జరగకపోయినా ఇబ్బందులు ఉంటాయని చెప్పారు.
'హిలాల్‌కు వచ్చిన ఇలాంటి అరుదైన వ్యాధి నుంచి ఢిల్లీకి చెందిన ఓ బాలుడు బయటపడ్డాడని మేం చదివాం. ఇది విన్న తర్వాత తమ కొడుకుకు కూడా తగ్గుతుందనే కొత్త ఆశలు చిగురించాయి. మా కొడుకు కూడా అలా ఆరోగ్యంగా తయారవగలడని విశ్వాసం కలిగింది. మా వంతుగా మా ప్రయత్నం చేస్తే అతను ఆనందమైన జీవితం గడపగలడని అర్థమైంది. అతని చెల్లి హిదయలా అతనిని కూడా చూడవచ్చునని గ్రహించాం. అందరి తల్లిదండ్రుల వలె బిడ్డల కోసం రంగుల కలలను నిర్మించుకుంటున్నాం. అయితే హిలాల్ చికిత్స కోసం మాకు ఆర్థికపరమైన అడ్డంకులు వస్తున్నాయి. ఓ వైపు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఇంత తక్కువ సమయంలో ఆపరేషన్‌కు అవసరమైన రూ.10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలనేది తోచడం లేదు' అని హిలాల్ తండ్రి అబూబకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. హిలాల్ తల్లి తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఏదైనా అద్భుతం జరిగి తన తనయుడిని కాపాడుతుందని ఆశపడుతోంది.

హిలాల్ తండ్రి ఆదాయం తక్కువ. కోళ్ల పెంపకం ద్వారా కొంత మొత్తం మాత్రమే సంపాదిస్తున్నాడు. కొడుకు కోసం తల్లి తన కెరీర్‌ను త్యాగం చేయవలసి వచ్చింది. ఈ కుటుంబానికి ఇతర సాధారణ ఆదాయ వనరులు లేవు. హిలాల్‌కు ఇప్పుడు వెంట్రిక్యులోపెరిటోనియల్ (VP) షంట్ అనే ఆపరేషన్ అవసరం. మరింత ఆలస్యం చేస్తే ప్రాణాంతకం కావొచ్చు. హిలాల్ ఆరోగ్య పరిస్థితి గురించి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంపాక్ట్‌గురు (ImpactGuru)కు విరాళం ఇవ్వడం ద్వారా అతనికి చికిత్స చేసేందుకు సహకరించవచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ మీరు హిలాల్ స్టోరీని షేర్ చేసి సహకరించవచ్చు.
RECOMMENDED STORIES